ఫ‌స్ట్‌డే 1.26 కోట్ల‌ గ్రాస్ వ‌సూలుచేసిన‌ 'అంతం' 


'గుంటూరు టాకీస్ త‌రువాత  రంజాన్ ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా ర‌ష్మిగౌతమ్ హీరోయిన్ గా విడుద‌ల‌యిన చిత్రం 'అంతం'. ద‌ర్శ‌క‌ నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ అతిత‌క్కువ‌ బ‌డ్జెట్ లో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించారు.చరణ్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. 300 ధియోట‌ర్స్ కి పైగా ఆంద్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణా, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో జులై 7న విడుద‌ల చేశారు. విడ‌దల‌యిన అన్ని సిటీస్ లో స్పీడ్ ఫుల్స్ తో, టౌన్స్ లో 90%  ఓపెనింగ్ తో మెద‌టిరోజునే 1.26 కొట్ల గ్రాస్ ని వ‌సూలు చేసి ఇండిపెండెంట్ చిన్న చిత్రాల్లో రికార్డు గా నిలిచింది. 
ఈ సందర్బంగా దర్శక నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ మాట్లాడుతూ.... మా 'అంతం చిత్రం 300 దియోట‌ర్స్ లొ విడుద‌ల‌య్యి మెద‌టిరోజు 1.26 కొట్ల గ్రాస్ వ‌సూలు చేయ్య‌టం చాలా ఆనందంగా వుంది. చాలా రీజ‌న్‌బుల్ రేట్స్ కి మా డిస్ట్రిబ్యూట‌ర్స్ కి ఇచ్చాము. వారంద‌రూ రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతాం అంటున్నారు. ఇండిపెండెంట్ చిన్న చిత్రాలు విడుద‌ల కావ‌టమే చాలా క‌ష్టంగా వున్న ఈరోజుల్లో మా చిత్రం విడుద‌ల ముందు బిజినెస్ కావ‌టం, గ్రాండ్ రిలీజ్ కావ‌టం. మెద‌టిరోజు రికార్డు క‌లెక్ష‌న్ రావ‌టం చాలా ఆనందంగా వుంది.గుంటూరు టాకీస్ చిత్రం త‌రువాత‌  రష్మీ గౌతమ్ న‌టించిన చిత్రం కావ‌టం, రంజాన్ ప‌ర్వ‌దినం కావ‌టం మా చిత్రానికి తెలుగు ప్రేక్ష‌కులు భారీ ఓపెనింగ్ ఇచ్చారు. వారంద‌రికి మాధ‌న్య‌వాదాలు.అని అన్నారు. 
నటీనటులు
రష్మీ గౌతమ్, చరణ్ దీప్, వాసుదేవ్, సుదర్శన్
సాంకేతిక వర్గం
ప్రొడక్షన్ బ్యానర్ - చరణ్ క్రియేషన్స్
సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, డిఐ - జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్
మ్యూజిక్ - కార్తిక్ రోడ్రిగ్జ్
స్టంట్స్ - రామ్ సుంకర
సౌండ్ ఎఫెక్ట్స్ - ఎతిరాజ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.లక్ష్మీపతి రావ్, బి.వేణు
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత - జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్