Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

ఫిబ్ర‌వ‌రి 17న రాజ్‌త‌రుణ్‌ `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`


యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ హీరోగా ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యాన‌ర్‌పై దొంగాట ఫేమ్ వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మంసుంక‌ర నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`. ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఫిబ్ర‌వ‌రి 17న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. 2016లో హిట్ అయిన చిత్రాల్లో ఈడోర‌కం-ఆడోర‌కం సినిమా త‌ర్వాత ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ న‌టిస్తున్న మ‌రో చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`.  ఈ చిత్రంలో రాజ్‌త‌రుణ్ కుక్క‌ల‌ను కిడ్నాప్ చేసే యువ‌కుడిగా పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నారు. డ‌బ్బు కోసం కుక్క‌ల‌ను కిడ్నాప్ చేయ‌డ‌మే కాకుండా, ప్రేమ కోసం రాజ్‌త‌రుణ్ ఏం చేశాడోతెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అనేక మ‌లుపుల‌తో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆస‌క్తిక‌రంగా సాగుతుందని నిర్మాత రామ బ్ర‌హ్మం సుంక‌ర తెలియ‌జేశారు.   గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి వంటి హిస్టారిక‌ల్ సినిమాకు సంభాష‌ణ‌లు రాసిన‌ రైట‌ర్ సాయిమాధ‌వ్ బుర్రా ఈ సినిమాకు ఫ‌న్నీ డైలాగ్స్‌ను అందించారు. రాజ్‌త‌రుణ్ స‌ర‌స‌న అనుఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్ సోద‌రుడు అర్బాజ్ ఖాన్ ఈ చిత్రంలో న‌టిస్తుండ‌టం విశేషం. అనూప్ రూబెన్స్ ఈసినిమాకు సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు.   రాజ్‌త‌రుణ్‌, అను ఇమ్మాన్యుయ‌ల్‌, పృథ్వీ, ర‌ఘుబాబు, రాజా ర‌వీంద్ర‌, తాగుబోతు ర‌మేష్‌, ప్ర‌వీణ్‌, సుద‌ర్శ‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి క‌థః శ్రీకాంత్ విస్సా, డైలాగ్స్ఃసాయిమాధ‌వ్ బుర్రా, ఎడిట‌ర్ః ఎం.ఆర్‌.వ‌ర్మ‌, ఆర్ట్ః అవినాష్‌, కెమెరాః బి.రాజ‌శేఖ‌ర్‌, స‌హ నిర్మాతః అజ‌య్ సుంక‌ర‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కిషోర్ గరిక‌పాటి, మ్యూజిక్ః అనూప్రూబెన్స్‌, నిర్మాతః రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌, ద‌ర్శ‌క‌త్వంః వంశీకృష్ణ‌