పెద‌నాన్న క్లాప్ కొట్టేశారు..


యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ , సుజిత్ (ర‌న్ రాజా ర‌న్ ఫేం) కాంబినేష‌న్ లో, వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న యు.వి.క్రియోష‌న్స్ ప‌తాకం పై వంశి, ప్ర‌మోద్ లు నిర్మాత‌లుగా తెర‌కెక్కుతున్న చిత్రం ఈరోజు (13 ఫిబ్ర‌వ‌రి) న యు.వి .క్రియోష‌న్స్ ఆఫీస్ లో నిరాడంబ‌రంగా పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. ఈ కార్క‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు గారు హ‌జ‌రయ్యారు. ఇంకా ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్‌, లు హ‌జ‌ర‌య్యారు.

రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు గారు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పై క్లాప్ ఇవ్వ‌గా, దిల్ రాజు గారు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు కొరియోగ్రాఫ‌ర్ రాజుసుంద‌రం, సంగీత ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఎషాన్ లాయ్ , సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ది, ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్ గా సాబు సిరిల్ లు . ఈ చిత్రం తెలుగు, త‌మిళం, హింది భాష‌ల్లో నిర్మిస్తున్నారు. షూటింగ్ మ‌రియు ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తారు.. ఈ చిత్రం యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ 19 వ చిత్రం గా "భాహుబ‌లి - క‌న్‌క్లూజ‌న్ " త‌రువాత చిత్రం గా విడుద‌ల అవుతుంది.