దాస‌రిని ప‌రామ‌ర్శించిన ఏపీ సీఎం చంద్ర‌బాబు


అనారోగ్యంతో కిమ్స్ లో చికిత్స తీసుకుంటున్న దాస‌రి ని ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌రామ‌ర్శించారు. త‌న ఆరోగ్యం గురించి ఆసుప‌త్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్న బాబు, మీడియాతో మాట్లాడుతూ, దాస‌రి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని త‌ను కోరుకుంటున్న‌ట్లుగా, త‌న‌కు ఆయ‌న‌తో చాలా స‌న్నిహిత సంబంధాలు ఉండేవ‌ని, త‌న కుటుంబ స‌భ్యుల‌లో దాస‌రి కూడా ఒక‌డ‌ని అన్నారు. దాస‌రి త‌న‌తో మాట్లాడార‌ని, మ‌రో రెండు మూడు రోజుల్లో ఆయ‌న పూర్తిగా కోలుకుంటార‌ని డాక్ట‌ర్లు అన్నార‌ని బాబు తెలిపారు.

mb