థ‌మ‌న్ కు ఆ ఛాన్స్ మిస్స‌యిన వేళ‌..


మాస్ మ‌హారాజ ర‌వితేజ దాదాపు సంవ‌త్స‌రం నుంచి సినిమాల‌కు దూరంగా, ఖాళీగా ఉంటున్నాడు. త‌న చివ‌రి సినిమా బెంగాల్ టైగ‌ర్. ఆ సినిమా రిలీజ్ అయి కూడా సంవ‌త్స‌రం దాటిపోయింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ర‌వితేజ త‌న త‌ర్వాత సినిమా గురించి త‌నకు తానుగా ఎక్క‌డా ప్ర‌స్తావించింది లేదు. గ‌త ఏడాది మొత్తం గ్యాప్ తీసుకున్న ర‌వితేజ‌, ఈ కొత్త ఏడాదిన ప‌టాస్, సుప్రీమ్ వంటి విజ‌యాల‌తో దూసుకుపోతున్న డైర‌క్ట‌ర్ అనిఇల్ రావిపూడితో త‌న త‌దుపరి సినిమాను ప్రారంభించనున్నాడు. ఏ ముహుర్తాన ర‌వితేజ‌కు మిర‌ప‌కాయ్ తో థ‌మ‌న్ హిట్ ఇచ్చాడో, అప్ప‌టి నుంచి ర‌వితేజ సినిమాల‌కు దాదాపుగా థ‌మ‌నే మ్యూజిక్ డైరక్ట‌ర్ అని ఫిక్స్ అయిపోయారు. ఏదో ఒక‌టి రెండు సినిమాల‌కు త‌ప్ప‌, ఎక్కువ‌గా థ‌మ‌న్ కే ఛాన్స్ ఇస్తాడు రవితేజ‌. కానీ, ఇప్పుడు మాత్రం థ‌మ‌న్ కి ఆ ఛాన్స్ మిస్ అయింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు మాత్రం సాయికార్తిక్ సంగీతం అందించ‌నున్నాడు. ఇప్పటివ‌ర‌కు చిన్న సినిమాలు లేదా, ఓ మాదిరి సినిమాల‌కు మాత్ర‌మే సంగ‌తం అందించిన సాయి కార్తిక్ కు ఇలాంటి ఆఫ‌ర్ రావ‌డం అంటే మామూలు విష‌యం కాదు. దానికితోడు ర‌వితేజ లాంటి పేరున్న హీరో, దిల్ రాజు లాంటి ప్రొడ్యూస‌ర్ సినిమాలో ఛాన్స్ వ‌చ్చింది అంటే, త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌రిగ్గా వాడుకుంటే,త‌న కెరీర్ మ‌లుపు తిరిగిన‌ట్లే అని అర్థ‌మ‌వుతుంది. ర‌వితేజ గుడ్డివాడిగా క‌నిపించ‌బోతున్న ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి నుంచి ప్రారంభం కానుంది.ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయి. ఈ సినిమాతో పాటు ర‌వితేజ న‌ల్ల‌మ‌లుపు బుజ్జి నిర్మాత‌గా మ‌రో సినిమా కూడా ఈ యేడాదిలోనే రానుంది. ఏదేమైనా ర‌వితేజ ఇకనైనా నువ్వు స్పీడ్ పెంచాలి రాజా..