తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని విద్యార్థులను కలుసుకున్న 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌' టీమ్‌ 


సోషల్‌ మీడియా నేపథ్యంలో యూత్‌ఫుల్‌ హార్రర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం 'ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'. ఈ చిత్రం జూలై 8న చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రాన్ని ప్రచారం చేసేందుకు చిత్ర యూనిట్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని వివిధ కళాశాలల్లోని విద్యార్థులను కలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలలోని వివిధ ఇంజనీరింగ్‌ మరియు డిగ్రీ, పిజి కాలేజీలలో విదార్థులను నేరుగా కలిసి చిత్రంలోని పాటలను, ట్రైలర్‌లను ప్రదర్శించారు. గుంటూరు, విజయవాడ, తణుకు, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, వైజాగ్‌, వరంగల్‌, కరీంనగర్‌లలోని కాలేజీలలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చిందని, సోషల్‌ మీడియాలో మేం చేసిన ప్రారం యూత్‌ని కనెక్ట్‌ చేసిందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. నటుడు, దర్శకుడు ఆదిత్యా ఓం, నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి, హీరోయిన్లు శీతల్‌, అనూషియాలు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర ప్రచారాన్ని నిర్వహించారు.