తార‌క‌రాముడి సంచ‌ల‌న రికార్డు


జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న జ‌నతా గ్యారేజ్ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రంజాన్ సంద‌ర్భంగా నిన్న సాయంత్రం జ‌న‌తా గ్యారేజ్ కు సంబంధించిన ఫ‌స్ట్ టీజ‌ర్ ను రిలీజ్ చేశారు. యాక్ష‌న్, ఎమోష‌న్ ప్ర‌ధానంగా ఉండేలా ఈ టీజ‌ర్ ను క‌ట్ చేశారు.
బ‌ల‌వంతుడు బ‌ల‌హీనుడిని భ‌య‌పెట్టి బ‌త‌క‌డం ఆన‌వాయితీ మ‌ధ్య‌లో ఇంట‌ర్ క‌ట్. రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ మీద ద‌ర్జాగా ఎన్టీఆర్ వ‌స్తుంటాడు. అండ్ ది డైలాగ్ కంటిన్యూస్.. బ‌ట్ ఫ‌ర్ ఎ ఛేంజ్, బ‌ల‌హీనుడి ప‌క్క‌న కూడా ఒక బ‌ల‌ముంది.. జ‌న‌తా గ్యారేజ్, ఇచట అన్ని రిపేర్లు చేయ‌బ‌డును. అంటూ ఎన్టీఆర్ చెప్పిన ఒక్క డైలాగ్ చాలు, సినిమాలో ఎంత అర్థ‌ముందో చెప్ప‌డానికి. సాధారణంగా ఇలాంటి ఆలోచ‌న‌లు ర‌చ‌యితలుగా ఉన్న వారికే వ‌స్తాయి.
టీజ‌ర్ యూట్యూబ్ లో విడుద‌లైన కేవ‌లం 6గంట‌ల్లోనే ఒక మిలియ‌న్ వ్యూస్ ల‌భించాయి. అభిమానులు జ‌న‌తా గ్యారేజ్ మీద ఎంత ఆస‌క్తి చూపుతున్నార‌నేది ఈ ఒక్క విష‌యంతోనే అర్థ‌మ‌వుతుంది. ఇది నిజంగా రికార్డు అని చెప్ప‌వ‌చ్చు. ఇప్ప‌టికే సినిమా ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ కి సూప‌ర్ రెస్పాన్స్ రావ‌డంతో, సినిమా ఇక ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు.