తాతయ్య సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుందా.. ?


టెంప‌ర్, నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్... ఇలా ఏ సినిమా కు ఆ సినిమాకే ఎన్టీఆర్ టైటిల్ ద‌గ్గ‌ర నుంచి త‌న లుక్స్ వ‌ర‌కు ప్ర‌తీ దాంట్లో కేర్ తీసుకుంటూ వ‌చ్చాడు. ఎన్టీఆర్ ఇక్క‌డితో ఆగేలా లేడు. త‌న త‌దుప‌రి సినిమాల‌కు కూడా ఈ కేరింగ్ ప్ర‌ద‌ర్శించాల‌ని అనుకుంటున్నాడు జూనియ‌ర్. ఈ నేప‌థ్యంలోనే ఎన్టీఆర్ త‌ర్వాత సినిమా టైటిల్ మీద ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌టికొచ్చాయి. న‌ట‌విశ్వ‌రూపం.. ఇదే ఎన్టీఆర్ కొత్త సినిమా టైటిల్ అంటూ వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టిన‌ప్ప‌టికీ, అభిమానులు మాత్రం ఈ టైటిల్ విష‌యంలో సుముఖ‌త చూపించ‌క‌పోగా, టైటిల్ బాగా లేద‌ని పెద‌వి విరిచేశారు. త‌న త‌మ్ముడి సినిమాకు సంబంధించి మీడియాలో వ‌స్తున్న వార్త‌లేవీ అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ లేకుండా న‌మ్మొద్ద‌ని , న‌ట విశ్వ‌రూపం టైటిల్ కాద‌నే విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పాడు క‌ళ్యాణ్ రామ్. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త సినిమాకు మ‌రో టైటిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదే జై ల‌వ‌కుశ‌. ఇది కూడా జ‌స్ట్ రూమ‌రే అనుకోవ‌డానికి లేదు. ఆల్రెడీ ఈ టైటిల్ ను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పేరు మీద ఫిల్మ్ ఛాంబ‌ర్ లో రిజిస్ట‌ర్ చేయించాడ‌ట క‌ళ్యాణ్ రామ్. అంటే ఇప్ప‌టి వ‌ర‌కు క‌ళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ తో సినిమా తప్ప‌, వేరే ఏ సినిమా గురించి ప్ర‌స్తావించింది లేదు కాబట్టి , ఎన్టీఆర్ బాబీతో క‌లిసి చేస్తున్న ఈ సినిమాకే ఆ టైటిల్ అని టాక్. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా కోస‌మే టైటిల్ ను రిజిస్ట‌ర్ చేయించుంటార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ స‌మాచారం. అటు తాత‌య్య సినిమా కూడా ల‌వ‌కుశ ఉండటం తో ఆ సెంటిమెంట్ కూడా వ‌ర్క‌వుట్ అయ్యే ఛాన్సుంది. చూద్దాంలే ప్రొడ్యూసర్ క‌ళ్యాణ్ రామ్ రూమ‌ర్స్ ను న‌మ్మొద్దు త‌నే చెప్తానన్నాడుగా..