టీవీ యాంక‌ర్స్ ను ప్ర‌మోట్ చేస్తున్న నిర్మాణ సంస్థ‌


త‌మ ప్రతీ చిత్రంలో వ‌రుస‌గా యాంక‌ర్స్ కు అవ‌కాశం క‌ల్పిస్తూ వ‌స్తున్న ఆర్ కె స్టూడియోస్. గుంటూరు టాకీస్ అనే చిత్రంతో యాంక‌ర్ ర‌ష్మిని ఒక స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందే పాత్ర‌లో ప‌రిచ‌యం చేయ‌గా, అదే విధంగా మ‌రో యాంక‌ర్ లాస్య ను ఒక ముఖ్య‌మైన పాత్ర‌లో రాజా మీరు కేక చిత్రంతో ప్ర‌మోట్ చేస్తున్నారు. రేవంత్, నోయ‌ల్, మిర్చి హేమంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాలో లాస్య త‌న‌దైన శైలిలో న‌టించి అల‌రించ‌నుంది. ఈ చిత్రం త‌ర్వాత యాంక‌ర్ లాస్య కు మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తాయ‌ని చిత్ర యూనిట్ గట్టిగా న‌మ్ముతుంది. ఈ చిత్రానికి కృష్ణ కిషోర్.టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రొడ్యూస‌ర్ః రాజ్ కుమార్. య‌మ్ డిఓపీః రామ్ పి రెడ్డి సంగీతంః శ్రీ చ‌ర‌ణ్ ఆర్ట్ః మారేష్ శివ‌న్ స్టంట్స్ః జాషువా https://www.youtube.com/watch?v=r_LSwFXzDpI