జ‌న‌తా గ్యారేజ్ టీజ‌ర్ కు అదే ప్ల‌స్


janatha
ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా జ‌న‌తా గ్యారేజ్ టీజ‌ర్ సంద‌డే. యూట్యాబ్ లో ఈ టీజ‌ర్ రిలీజ్ అయిన 6రోజుల్లో 4మిలియ‌న్లకి పైగా వ్యూస్ రావ‌డం అంటే మామూలు విష‌యం కాదు. కబాలి త‌రువాతి స్థానంలో ఈ సినిమా టీజ‌ర్ నిలిచింద‌ని అంటున్నారు. జ‌న‌తా గ్యారేజ్ టీజ‌ర్ కు ఈ స్థాయిలో రెస్పాన్స్ రావ‌డానికి కార‌ణం వేరే ఏదో కాదు, ఎన్టీఆరే న‌ని అంటున్నారు. ఫ్యాన్స్ తో ఎన్టీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు ట‌చ్ లో ఉండ‌ట‌మే దీనికంత‌టకీ నిద‌ర్శ‌నమ‌నే టాక్ వినిపిస్తోంది.
త‌మ ఫేవ‌రెట్ హీరోను ఒక అభిమాని క‌లుసుకుంటే, ఆ విష‌యం అక్క‌డితో ఆగ‌దు. త‌న‌కు తెలిసిన వారింద‌రికీ చెప్తూనే ఉంటారు. అలా ఆ సినిమాకు సంబంధించిన స‌మాచారం జ‌నంలోకి వెళ్తుంది. ఈ సినిమా విష‌యంలోనూ అచ్చు అదే జ‌రిగింది. జ‌న‌తా గ్యారేజ్ విరామ స‌మ‌యాల్లో ఎన్టీఆర్ ఎంతో మంది అభిమానుల‌ను కలుసుకుని, సినిమా గురించిన విశేషాల‌ను వాళ్ల‌తో పంచుకుని, ఇలా అందరిలోనూ సినిమాపై ఆస‌క్తిని క‌లిగించాడు. ఫ్యాన్స్ తో ఎన్టీఆర్ ట‌చ్ లో ఉండ‌టం ఈ టీజ‌ర్ కు ప్ల‌స్ పాయింట్ అయింద‌నే అభిప్రాయాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి.