Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

జూలై 16న ఆది వీరభద్రమ్‌ల 'చుట్టాలబ్బాయి' ఆడియో


జూలై 16న ఆది, వీరభద్రమ్‌ల 'చుట్టాలబ్బాయి' ఆడియో
లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌, ఎస్‌.ఆర్‌.టి. మూవీ హౌస్‌ పతాకాలపై వీరభద్రమ్‌ దర్శకత్వంలో వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్ళూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'చుట్టాలబ్బాయి'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 22న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. కాగా, ఈ చిత్రం ఆడియోను జూలై 16 చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఆడియో ఫంక్షన్‌కి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ తలసాని శ్రీనివాస యాదవ్‌ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఇంకా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ఎందరో సెలబ్రిటీస్‌ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 
లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, నమిత ప్రమోద్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, కృష్ణభగవాన్‌, అభిమన్యు సింగ్‌, జీవా, సురేఖావాణి, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి, గిరిధర్‌, అనితనాథ్‌ దితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌, ఆర్ట్‌: నాగేంద్ర, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, మాటలు: భవాని ప్రసాద్‌, స్టిల్స్‌: గుణకర్‌, నిర్మాతలు: వెంకట్‌ తలారి, రాము తాళ్ళూరి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వీరభద్రమ్‌.