Latest News

వంద‌కోట్లు అనేది నంబ‌ర్ కాదు. అంత మంది ప్రేక్ష‌కుల ప్రేమ : అల్లు అర్జున్ మా బ్యాన‌ర్‌లో 25వ సినిమా డీజే.. 100 కోట్లు సాధించ‌డం ఆనందంగా ఉంది - దిల్‌రాజు విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా నటించిన 'ఏజంట్‌ భైరవ' జూలై 7న విడుదల ఈరోజు నిన్నుకోరి సినిమా జ్యూక్ బాక్స్ విడుదల. జై లవ కుశ టీజర్ మరియు సినిమా విడుదల తేదీ ప్రకటించిన చిత్ర యూనిట్. గ్లామర్ తో తెలుగు సినీ పరిశ్రమకి గాలం వేసిన పూజ హెగ్డే టీఎస్‌ఎఫ్‌టీవీ అండ్‌ టీడీసీ చైర్మన్‌గా నియమితులైన పుస్కూర్‌ రామ్మోహన్‌కి దాసరి కిరణ్‌కుమార్‌ అభినందనలు "మెంటల్ మదిలో" చిత్రంలోని అరవింద్ కృష్ణ పాత్ర పరిచయం విజయ్ అదిరింది ఫస్ట్ లుక్ కు ట్రెమండస్ రెస్పాన్స్… జూలై 14న 'దండుపాళ్యం-2' ​

చిరు, పవన్ కలయిక వెనుక ఉన్న సీక్రెట్ ఇదే !


టి. సుబ్బి రామిరెడ్డి నిర్మాణ సారధ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలసి ఒక సినిమా చేయబోతున్నారు అన్న విషయం కన్ఫర్మ్ అయిపోయింది . ఈ విషయం తెలిసినప్పటి నుండి మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పుకోవచ్చు . అయితే ఇప్పటికి ఇప్పుడు ఈ అన్నదమ్ములిద్దరూ కలసి సినిమా చేయబోతుండటానికి కారణం ఏమిటి అన్నది మాత్రం ఎవ్వరూ ఆలోచించడం లేదు . ఆ విషయాన్ని కాస్త లోతుగా ఆలోచించి చూస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అర్ధం అవుతాయి . ఎవరు ఒప్పుకున్నా , ఒప్పుకోకపోయినా గత కొంత కాలంగా మెగా బ్రదర్స్ మధ్య మ‌న‌స్పర్ధలు వచ్చిన మాట వాస్తవమే .

తమ్ముడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా అన్నయ్య ని ఎదిరించడమే ఈ గొడవలకి నాంది అని చెప్పుకోవచ్చు . ఇక అప్పటి నుండి మెగా అభిమానులు కాస్త, చిరు అభిమానులగాను, పవర్ స్టార్ అభిమానులగాను స్ప్లిట్ అయిపోయారు. ఇక కొన్ని సినీ వేడుకల్లో అయితే పవన్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఒకానొక ఫంక్షన్ లో అయితే ఏకంగా మెగాస్టార్ నే ఒక ఆట ఆడేసుకున్నారు! ఇక తరువాత బన్నీ రంగంలోకి దిగడం , చెప్పను బ్రదర్ అంటూ పవన్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టడం , ఆ తరువాత అంతా బన్నీ ని కార్నర్ చేయడం అంతా ఒకదాని తరువాత ఒకటి జరిగిపోయాయి . ఇక చిరు 150 వ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి కూడా పవన్ రానేలేదు. ఈ పరిణామాలన్నీ ఇన్నర్ గా మెగా బ్రదర్స్ కి ఎలా అనిపించినా బయట నుండి చూస్తున్న ఫ్యాన్స్ మధ్య గ్యాప్ తీసుకొని రావడం ఖాయం . ఇదే విషయాన్ని ఈ అన్నయ్య , తమ్ముడు కాస్త ఆలశ్యంగా గుర్తించారట . పొలిటికల్ గా తన దారులు వేరైనా, తమ అందరి బలం మాత్రం అభిమానులే . అందుకే ఆ అభిమానుల మధ్య చీలికలు రాకుండా ఉండాలంటే ఇప్పుడు పవన్ చిరు కలసి మల్టీ స్టారర్ చేయక తప్పనిసరి పరిస్థితి ఎదురయింది. సో ఈ అన్నదమ్ములిద్దరూ కలసి సినిమా చేయడానికి కారణం మెగా అభిమానులే కాబట్టి ,ఈ క్రెడిట్ అంతా అభిమానులకే దక్కుతుంది.