గూగుల్ సీఈఓ ఫేవ‌రెట్ హీరోయిన్ ఆమే..


కొంత మంది ప్ర‌ముఖులు త‌మ త‌మ అభిరుచుల‌ను బ‌య‌ట‌కు చెప్పుకోడానికి అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. కానీ గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచ‌య్ మాత్రం త‌న ఇష్టాయిష్టాల‌ను విద్యార్థులతో పంచుకున్నారు. నిన్న ఇండియాకు వచ్చిన సుంద‌ర్ పిచయ్, ఖరగ్ పూర్ ఐఐటీ విద్యార్థులతో పిచాయ్ పిచ్చాపాటిగా మాట్లాడారు. పిచాయ్ కూడా 1993లో ఖరగ్ పూర్ ఐఐటీలోనే లోహశోధన ఇంజినీరింగ్ చేశారు. ఆ తర్వాత వార్టన్ బిజినెస్ స్కూల్ లో ఎంబీఏ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఖరగ్ పూర్ ఐఐటీ విద్యార్థులతో పిచాయ్ మాట్లాడుతూ, రాత్రిళ్లు మొత్తం మేల్కొని చదువుతుండటంతో, మరుసటి రోజు క్లాసులకు వెళ్లలేక పోయేవాడినని చెప్పారు. హాస్టల్ ఫుడ్ పప్పా, సాంబారా అని చూసేవాడినని తెలిపారు. తనకు హిందీ బాగా రాదని అన్నారు. తాను కంప్యూటర్ ను తొలిసారి ఇక్కడే చూశానని చెెప్పారు. తనకు ఇష్టమైన హీరోయిన్ దీపికా పదుకొనే అని, ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని తెలిపారు.