క‌బాలి రిలీజ్ డేట్ క‌న్ఫార్మ్


ప్ర‌పంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఆశ‌గా ఎదురుచూస్తున్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వ‌చ్చేసింది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమా క‌బాలి రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడా అనుకుంటున్న త‌రుణంలో డేట్ అనౌన్స్ మెంట్ అయిపోయింది. జులై 22న సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు నిర్మాత క‌లైపులి థానునే అఫిషియ‌ల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. రిలీజ్ డేట్ విష‌యంలో ఎన్నోరోజులుగా రక‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రుగుతున్నా సైలెంట్ గా ఉన్న థాను, సినిమా సెన్సార్ అయిన వెంట‌నే కొంత సేప‌టికే విడుద‌ల తేదీ ప్ర‌క‌టించారు.
జులై 22న వ‌ర‌ల్డ్ వైడ్ గా కబాలి విడుదలవుతుందని.. ఇంతకంటే తమకు ఎగ్జైట్మెంట్ ఇచ్చే విషయం మరొకటి ఉండదని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతకుముందు కబాలి సెన్సార్ విశేషాల్ని కూడా ఆయన అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చిందని.. సినిమా నిడివి 152 నిమిషాలని ఆయన వెల్లడించారు.