కొత్త అవ‌తార‌మెత్తిన రామ్‌


యంగ్ అండ్ ఎనర్జిటిక్  హీరో రామ్ కొత్త అవ‌తారంలో ద‌ర్శ‌న‌మిచ్చాడు. పండ‌గ చేస్కో సినిమా కోసం పెళ్లికొడుకుగా అవ‌తార‌మెత్తి, అమ్మాయిల గుండె ఆపేసిన రామ్ నిన్న ప‌ద‌హార‌ణాల తెలుగుద‌నానికి నిద‌ర్శ‌నంగా పంచె క‌ట్టాడు అచ్చు తెలుగు అబ్బాయి అనిపించుకున్నాడు. కానీ, ఈసారి పంచె క‌ట్టింది మాత్రం సినిమా కోసం కాద‌ట‌, పెళ్లి కోస‌మేన‌ట‌. త‌న స్నేహితుడి పెళ్లికి హాజ‌ర‌వ్వ‌డానికి ఇలా త‌న ఆహార్యాన్ని మార్చాన‌ని, ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ కి వెళ్తున్నాను అందుకే ఇలా.. అంటూ ట్వీట్ తో పాటు తను పంచెక‌ట్టులో ఉన్న ఫోటోను కూడా ట్వీట్ చేశాడు. రీజ‌న్ ఏదైనా, కాస్ట్యూమ్ ఏదైనా స‌రే, త‌మ హీరో చాలా హ్యాండ్ స‌మ్ గా ఉన్నాడ‌ని, అభిమానులు పండ‌గ చేస్కుంటున్నారు.