ఎలాగైనా సినిమా తియ్యాలి ఆడియో విడుదల


తరుణ్‌తేజ్‌, శ్రీలేఖ హీరోహీరోయిన్లుగా తేజ ఆర్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై లక్ష్మీ దివ్య సమర్పణలో రవికుమార్‌ పి దర్శకత్వంలో శ్రీమతి పద్మజ నిర్మిస్తున్న చిత్రం ఎలాగైనా సినిమా తీయ్యాలి. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైద్రాబాద్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రతాని రామకృష్ణ గౌడ్‌ ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి సీడీని నిర్మాత పద్మజకు అందించారు. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ..పాటలు చాలా బాగున్నాయి. టీజర్‌ చాలా బాగుంది. దర్శకుడు రవికుమార్‌ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. ఫోటోగ్రఫీ హైలైట్‌గా ఉంది. మంచి ప్రమోషన్‌తో చిత్రాన్ని విడుదల చేస్తే తప్పకుండా విజయవంతం అవుతుందని..అన్నారు. దర్శకుడు రవికుమార్‌ మాట్లాడుతూ..ఎలాగైనా సినిమా తీయ్యాలి చిత్రాన్ని ఒక ఆశయంతో తీశాం. ఒక యువకుడు చదువు కోసం సీటీకి వచ్చి సినిమా మీద ఫ్యాషన్‌తో చదువును మానేసి చిత్ర పరిశ్రమకు వచ్చి ఏమి సాధించలేక చనిపోతే, అన్న ఆశయం కోసం తమ్ముడు చదువును మాని చిత్ర పరిశ్రమకు వచ్చి ఎలా విజయం సాధించాడు అన్నదే చిత్ర కథ. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు సంగీతాన్ని కూడా అందించాను. దీని తర్వాత రెండు చిత్రాలు చేస్తున్నాను. ఈ నెలాఖరుకి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము..అన్నారు.