ఎన్టీఆర్ బ‌యోపిక్ కు డైర‌క్ట‌ర్ ఆయ‌నే..


స్వర్గీయ శ్రీ నంద‌మూరి తార‌క రామారావు గారి జీవిత చరిత్ర ను ఆధారంగా చేసుకుని సినిమాను తెర‌కెక్కించ‌నున్నామ‌ని బాల‌కృష్ణ చేసిన ప్ర‌క‌ట‌న‌తో యావ‌త్తె లుగు ప్రేక్ష‌కులు ఎంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిర‌య్యారు. ఎన్టీఆర్ పాత్ర‌ను తానే చేయ‌బోతున్నాన‌ని చెప్పిన బాల‌య్య‌, ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి, స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ని, మిగ‌తా వివ‌రాలు కూడా త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని చెప్పారు.

ఎప్పుడైతే ఈ సినిమా అనౌన్స్ చేశారో, అప్ప‌టి నుంచి ఈ సినిమాకు సంబంధించిన నిర్మాత ఎవ‌రు, ద‌ర్శ‌కుడు ఎవ‌రు, ఎప్పుడు సినిమా మొద‌లు పెడ‌తారు, ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ఎన్నో ప్ర‌శ్న‌లు అభిమానుల‌ను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ పేరు వినిపిస్తోంది. అస‌లు ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ను సినిమా తీయాల‌న్న‌ది బాలయ్య ఆలోచ‌న కాద‌ని, అదంతా పూరీ ప్లానే అని, ఈ స్టోరీకి సంబంధించి ఒక లైన్ రూపంలో స్టోరీ ని చెప్పిన వెంట‌నే బాల‌య్య నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చి, బాల‌య్య సినిమా గురించి ప్ర‌క‌ట‌న చేశాడ‌ని అంటున్నారు.

అయితే దాదాపుగా గ‌త రెండేళ్లుగా స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్న పూరీ, ఈ సినిమాతో ఎలాగైనా త‌న స్టామినాని నిరూపించుకోవాల‌ని ట్రై చేస్తున్నాడ‌ట‌. ఈ సినిమా కోసం కేవ‌లం పూరీ మాత్ర‌మే కాదు, మ‌రో ఇద్ద‌రు రైట‌ర్స్ కూడా ఈ సినిమా కోసం స్క్రిప్ట్ వ‌ర్క్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జ‌యంతి రోజైన మే 28న ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే యోచ‌న‌లో ఉన్నాడ‌ట బాల‌య్య‌.