ఈ ఆఫ‌ర్ ఏదో బాగున్న‌ట్లుందే..


పదేళ్ల విరామంతో 150వ సినిమాతో మెగాస్టార్‌ చిరంజీవి, చరిత్రాత్మ‌క క‌థ‌నంతో వందో సినిమాతో నంద‌మూరి బాల‌కృష్ణ తెలుగు వెండితెర‌కు కొత్త వెలుగుల‌ను కొత్త ఉత్సాహాన్ని తెచ్చారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్ ద‌శ‌కం త‌ర్వాత తెలుగు వెండితెర‌ను అత్య‌ధిక కాలం ఏలిన ఈ మ‌హా స్టార్లు ఇద్ద‌రూ ఒకేసారి తెలుగు వారికి అత్యంత ప్రియ‌మైన సంక్రాంతి పండ‌గ సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. అయితే, హైద‌రాబాదులోని ఓ రెస్టారెంట్‌ మ‌రువ‌లేని ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని అమీర్‌పేట‌లోని తాలింపు రెస్టారెంట్ ఆ రెండు సినిమాల వీక్ష‌కుల‌కు గొప్ప ఆఫ‌ర్ ను ప్ర‌క‌టిస్తోంది.  
చిరంజీవి 150 సినిమా ఖైదీ నెం.150 చూసి ఆ టికెట్ ను తీసుకుని తాలింపు రెస్టారెంటు (అమీర్‌పేట‌)కు వ‌స్తే వారికి రూ.175 విలువైన బిర్యానీని ఆ సినిమాకు గుర్తుగా 150  రూపాల‌య‌కే ఇస్తుంది. అభిమానుల‌కు ఇది అంకితం. 
గురువారం విడుద‌ల అవుతున్న బాల‌కృష్ణ వందో సినిమా గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి చూసి వ‌చ్చిన అభిమానులకు 130 రూపాయ‌లు విలువైన సింగిల్ చికెన్ బిర్యానీని బాల‌య్య‌ వందో సినిమా గుర్తుగా వంద రూపాయ‌లకే అందిస్తుంది తాలింపు రెస్టారెంటు. ఇది బాల‌య్య అభిమానుల‌కు అంకితం.
ఈ ఆఫ‌రును స‌ద్వినియోగం  చేసుకోవాలంటే క‌చ్చితంగా టికెట్ వెంట తీసుకురావాలి. ఆఫ‌రు ఒక టికెట్‌పై ఒక బిర్యానీకే వ‌ర్తిస్తుంది. 
ఈ సినిమా పండ‌గను తాలింపు ఆఫ‌ర్ల‌తో ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకోండి. ఈ ఆఫ‌ర్లు సినిమా ప్రేక్ష‌కుల‌కు అంకితం.