Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

ఈసారి ఈవెంట్‌కు టార్గెట్ ఎవ‌రో..?


మెగాస్టార్ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఖైదీ నెం.150. ఈ సినిమా మొద‌లుపెట్టిన రోజు నుంచి, ముహుర్తం షాట్ నుంచి, టీజ‌ర్, ఆడియో, ఇప్పుడు సినిమా, ఇలా అన్నింటికీ ఓ రేంజ్ లో రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌తీ దానిలో రికార్డు స్థాయిలో ఈ సినిమాను ఉంచారు. సినిమా ఇంతటి విజ‌యాన్ని సాధించినందుకు ఖైదీ టీమ్ అంతా ఫుల్ జోష్ లో ఉన్నారు. సినిమా ఈ రేంజ్ లో విజ‌యం సాధించడానికి కార‌ణ‌మైన ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్ చెప్పడానికి థ్యాంక్స్ మీట్ పేరుతో, మ‌రో మెగా ఈవెంట్ ను నిర్వ‌హించ‌నున్నట్లు స‌మాచారం. ఖైదీ నెం.150 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఈ ఈవెంట్ ను ప్లాన్ చేయాలని చూస్తుంద‌ట టీమ్. ఫంక్ష‌న్ ఈసారి హైదరాబాద్ లోనే చేయాల‌ని, అల్లుఅర‌వింద్ ఆల్రెడీ ఈ మెగా ఈవెంట్ ప‌నుల్లోనే ఉన్నాడ‌ని అంటున్నారు. త‌న‌కు ఈ రేంజ్ లో మ‌ళ్లీ స్వాగ‌తం ప‌లికిన అభిమానుల‌కు కృత‌జ్క్ష‌త‌లు చెప్ప‌డం కోస‌మే ఈ ఫంక్ష‌న్ ను నిర్వ‌హించడానికి అసలు కార‌ణంగా చెప్పుకుంటున్నారు. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే,ఆ ఈవెంట్ కు అయినా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌స్తాడా, ఈసారి చెర్రీ ఎవ‌రెవ‌రిని గెస్టులుగా తీసుకురాబోతున్నాడు, ఈసారి మెగా ఫ్యామిలీ నుంచి ఎవ‌రు ఎంత ర‌చ్చ చేస్తారో ..? ఏదేమైనా త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై అఫిషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే ఛాన్స్ ఉంది.