ఈసారైనా అబ్బాయ్ కోరిక నెర‌వేరుతుందా..?


మెగాస్టార్ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఖైదీ నెం.150. ఈ సినిమా మొద‌లుపెట్టిన రోజు నుంచి, ముహుర్తం షాట్ నుంచి, టీజ‌ర్, ఆడియో, ఇప్పుడు సినిమా, ఇలా అన్నింటికీ ఓ రేంజ్ లో రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌తీ దానిలో రికార్డు స్థాయిలో ఈ సినిమాను ఉంచారు. సినిమా ఇంతటి విజ‌యాన్ని సాధించినందుకు ఖైదీ టీమ్ అంతా ఫుల్ జోష్ లో ఉన్నారు. సినిమా ఈ రేంజ్ లో విజ‌యం సాధించడానికి కార‌ణ‌మైన ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్ చెప్పడానికి థ్యాంక్స్ మీట్ పేరుతో, మ‌రో మెగా ఈవెంట్ ను నిర్వ‌హించ‌నున్నట్లు స‌మాచారం. ఖైదీ నెం.150 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఈ ఈవెంట్ ను ప్లాన్ చేయాలని చూస్తుంద‌ట టీమ్. ఫంక్ష‌న్ ఈసారి హైదరాబాద్ లోనే చేయాల‌ని, అల్లుఅర‌వింద్ ఆల్రెడీ ఈ మెగా ఈవెంట్ ప‌నుల్లోనే ఉన్నాడ‌ని అంటున్నారు. త‌న‌కు ఈ రేంజ్ లో మ‌ళ్లీ స్వాగ‌తం ప‌లికిన అభిమానుల‌కు కృత‌జ్క్ష‌త‌లు చెప్ప‌డం కోస‌మే ఈ ఫంక్ష‌న్ ను నిర్వ‌హించడానికి అసలు కార‌ణంగా చెప్పుకుంటున్నారు. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే,ఆ ఈవెంట్ కు అయినా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌స్తాడా, ఈసారి చెర్రీ ఎవ‌రెవ‌రిని గెస్టులుగా తీసుకురాబోతున్నాడు, ఈసారి మెగా ఫ్యామిలీ నుంచి ఎవ‌రు ఎంత ర‌చ్చ చేస్తారో ..? త్వ‌ర‌లోనే నిర్మాత రామ్ చ‌ర‌ణ్, ఈ ఈవెంట్ కు సంబంధించిన తేదీ, వేదిక‌ల గురించిన మ‌రింత సమాచారం వెల్ల‌డించ‌నున్నాడు.