ఆటోకి రైట్ చెప్పిన చిరు?


మెగాస్టార్ 150వ సినిమాగా ఆటోజానీ అనే పేరుతో సినిమా రానుంద‌ని తెలియ‌డంతో, ఆ పేరు బాగా పాపుల‌ర్ అయింది. పూరీ డైర‌క్ట‌ర్ గా రామ్ చ‌ర‌ణ్ అనౌన్స్ కూడా చేసేశాడు. దానికి సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో కూడా పెట్టారు. కానీ ఆఖ‌రి ద‌శ‌లో సినిమాలో సెకండాఫ్ బాగా లేద‌ని వంక పెట్టి ఆటోజానీకి బ్రేక్ వేసి, వినాయ‌క్ తో క‌లిసి క‌త్తి ప‌ట్టాడు చిరంజీవి.
కానీ, పూరీ మాత్రం 150 మిస్ అయినా తను చిరు తో సినిమా చేసే తీరుతా అని, అది 151 అయినా, 160 అయినా వదిలే ప్రసక్తే లేదని, తన జీవితాశయాన్ని నెరవేర్చుకుంటా అని ట్విట్ట‌ర్ లో శపథం కూడా చేసాడు. ఒకానొక త‌రుణంలో చిరంజీవికి, పూరీ జ‌గ‌న్నాథ్ కి మ‌ధ్య ఏదో గ్యాప్ వ‌చ్చింద‌ని కూడా పుకార్లు వినిపించాయి.
ఇదిలా ఉండ‌గా పూరీ కసితో ఆటో జానీ సెకండ్ హాఫ్ మార్చి, చిరంజీవికి వినిపించగా, చిరు బాగా ఇంప్రెస్ అయి ఓకే చెప్పాశాడ‌ని టాక్. సో, ఇదంతా చూస్తుంటే చిరంజీవి 151వ సినిమా ఆటో జానీ అయినా ఆశ్చర్య‌పోన‌క్క‌ర్లేద‌నేది ఇండస్ట్రీ టాక్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రావొచ్చు. దీన్ని బట్టి చూస్తుంటే చిరు, పూరి సినిమాకి శుభం కార్డు పడినట్లే అనిపిస్తుంది.