అల్లు అర్జున్ పై పవన్ ఫ్యాన్స్ కి కోపం ఎందుకు ?


మెగా హీరోలు తమ మధ్య ఎలాంటి గొడవలు లేవు తామంటే ఒకటే అని చెప్తున్నా వారి మధ్య ఏదో గ్యాప్ ఉన్న విషయం మాత్రం ఎప్పటికి అప్పుడు ఋజువు అవుతూనే ఉంది. ఈ విషయంలో మెగా బ్రదర్స్ ని కాస్త పక్కన పెట్టేస్తే.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి.. అల్లు అండ్ టీంకు పడడం లేదని.. అల్లు అర్జున్ "చెప్పను బ్రదర్' స్టేట్మెంట్ తర్వాత అందరికి ఓపెన్ గానే అర్ధం అయిపోయింది.  
 
తాజాగా కాటమరాయుడు విషయంలో అల్లు అర్జున్ సైలెన్స్ పాటించడం చూస్తుంటే.. వీరిద్దరి మధ్యా ఇంకో ఏదో వివాదం నడుస్తోందని అనిపించక మానదు. తాజాగా కాటమరాయుడు ట్రైలర్ రిలీజ్ అవడం.. మెగా హీరోలంతా పవన్ ను.. కాటమరాయుడు టీజర్ ను పొగిడేయడం జరిగింది. కానీ అల్లు అర్జున్ మాత్రం కాటమరాయుడుపై చిన్న ట్వీట్ కూడా పెట్టలేదు. విషెస్ చెప్పలేదు. విచిత్రం ఏంటంటే..  గౌతమిపుత్ర శాతకర్ణి.. శతమానం భవతి వంటి ఇతర హీరోల సినిమాలకు కూడా విషెస్ చెబుతున్న అల్లు హీరోలు.. పవన్ విషయంలో మాత్రం సైలెన్స్ పాటిస్తుండడం.. ఇప్పుడు పవర్ స్టార్ అభిమానులకి కాస్త నిరాశ కలిగిస్తుంది. మరి ఇప్పటికైనా స్టైలిష్ స్టార్ , పవర్ స్టార్ టీజర్ పై ఒక ట్వీట్ చేస్తాడు ఏమో చూడాలి.