అయ్యో అయ్యో అయ్య‌య్యో.. వెంకీకి ఎన్ని క‌ష్టాలు?


వెంకటేశ్ కథానాయకుడిగా తెర‌కెక్కుతున్న సినిమా ‘గురు’. ఈ సినిమాను ముందుగా సంక్రాంతికి విడుదల చేయాలనుకున్న‌ప్ప‌టికీ, పోటీ ఎక్కువగా ఉండటంతో, జనవరి 26 తేదీకి రిలీజ్ ను వాయిదా వేసుకున్నారు. కానీ అదే రోజున ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘సింగం 3’ రెడీయైపోయింది. ఈ సినిమా మామూలుగా అయితే డిసెంబ‌ర్ 16 న విడుద‌ల కావాల్సి ఉన్న‌ప్ప‌టికీ, ధృవ సినిమా కోసం సింగం3 ను వాయిదా వేసుకుని, త‌ర్వాత 23న రిలీజ్ చేయాల‌నుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల 23న కూడా వాయిదా ప‌డిన ఈ సినిమా జ‌న‌వ‌రి 26వ తేదీని ఖ‌రారు చేసుకుంది. సింగం 3 డ‌బ్బింగ్ సినిమా అయినా, ఆ సినిమాకు తెలుగులో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దానికి తోడు సినిమా లోని న‌టీన‌టులంద‌రూ క్రేజ్ ఉన్న వాళ్లే. నిజం చెప్పాలంటే ఈ సినిమాకు ఉన్నంత భారీ తారాగ‌ణం గురు సినిమాకు లేదు. పైగా గురు ఆల్రెడీ త‌మిళ్, హిందీ భాష‌ల్లో హిట్ సినిమాకు రీమేక్. ముందు అనుకున్న ప్ర‌కారం సంక్రాంతి కి రావాల్సిన గురు కొన్ని అనివార్య కార‌ణాల‌తో జ‌న‌వ‌రి 26కు వెళ్లిపోయింది. దీనిప‌ట్ల ఇప్ప‌టికే, వెంకీ అసంతృప్తితో ఉన్నాడు. ఇలాంటి స‌మ‌యంలో మ‌ళ్లీ సూర్య సింగం3 తో రెడీ అయిపోవడంతో, ఎంత హిట్ సినిమా రీమేక్ అయినా, వ‌సూళ్లు బాగానే ఉంటాయన్న ఆలోచ‌న‌లో గురు ను కొంచెం ఆల‌స్య‌మైనా ఒంట‌రిగానే బ‌రిలోకి దింపనున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. https://www.youtube.com/watch?v=3fU1lVH9ezE