అందుకే త‌న‌కు ట్రంప్ ఆద‌ర్శ‌మ‌ట‌..


డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఈ పేరు ఎత్తితే చాలు . అంతా మంది పడుతున్నారు . సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే పేరెత్తితే చాలు.. నిద్రలో కూడా కలవర పడుతున్నారు ఇలాంటి సమయంలో స్టార్ హీరో నాగార్జున హీరో ట్రంప్ తనకి ఆదర్శం అంటూ బాంబ్ పేల్చాడు . జనాలకు.. తనకు మధ్య అడ్డు గోడలు లేకుండా ట్రంప్ సోషల్ మీడియా ద్వారా.. తన అభిప్రాయాలు జనాలకు తెలిసేలా చేశాడని.. అదే అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయానికి కారణమైందన్నాడు నాగ్.

ఇప్పుడు ట్రంప్ స్పూర్తితో తాను కూడా.. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో యాక్టివ్ అయ్యానని.. మన గురించి ఎవరో చెప్పడం కన్నా.. మన సమాచారం సూటిగా జనాలకు మనమే చేరవేస్తే బాగుంటుందంటున్నాడు నాగ్. నిజానికి ఈ మధ్య కాలంలో నాగ్ మాటల్లో వేదాంతం ఎక్కువుగా కనిపిస్తుంది. కొడుకులు ఇద్దరూ తమకి నచ్చిన వారినే పెళ్లి చేసుకోవడానికి నాగ్ ఎలాంటి షరతులు పెట్టకుండా వారిని ఒక్కటి చేశాడు. ఇక రీసెంట్ గా తనకి నెంబర్ గేమ్ మీద ఆసక్తి లేదంటూ, తాను స్టార్ స్టేటస్ ని ఆశించడం లేదని అక్కినేని అభిమానులకి కొత్త ట్విస్ట్ ఇచ్చాడు . ఇప్పుడు ఏకంగా అంతా తిడుతున్న ట్రంప్ తనకి ఆదర్శం అంటూ మరో షాక్ ఇచ్చాడు . ఇలా నాగ్ చేస్తున్న ప్రతిదీ కూడా అందరికి షాక్ ఇస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.