ఇక తాగుడు మానేస్తున్నా... పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌‌ నన్ను క్షమించండి : రామ్ గోపాల్ వర్మ


రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద ట్వీట్‌తో సోషల్ మీడియాను వేడెక్కిస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం కాస్త భిన్నంగా.... తన ట్వీట్లతో అందరినీ చల్లబరిచే ప్రయత్నం చేసారు. వోడ్కా మానేస్తున్నానని, ఇంతకాలం తన వల్ల బాధకు గురైన వారికి, పవన్ కళ్యాణ్ అభిమానులకి మరియు గణపతి భక్తులకి క్షమాపణ చెబుతున్నట్లు ట్వీట్ చేసారు. ఇకపై తన కామెంట్స్ తో ఎవరినీ బాధ పెట్టబోనని తెలిపారు.


రామ్ గోపాల్ వర్మలో ఇంత మార్పు రావడానికి కారణం.... బాలీవుడ్ నటుడు విద్యుత్ జామ్ వాల్. ఇటీవల తన ట్విట్టర్లో వర్మ కొన్ని కామెంట్స్ చేస్తూ.... విద్యుత్ జామ్ వాల్, టైగర్ ష్రాఫ్ ల మార్షల్ ఆర్ట్స్ స్టైల్ మీద కామెంట్స్ చేసాడు.