Latest News

Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన అక్టోబ‌ర్ 27న `కాళ‌రాత్రి` షూటింగ్ ప్రారంభం "సువర్ణ సుందరి" గా మారిన జయప్రద

'బీప్' షార్ట్ ఫిల్మ్ కు అద్భుతమైన స్పందన


 కిషోర్ మారిశెట్టి, గ్రేస్ జంటగా నటించిన షార్ట్ ఫిల్మ్ బీప్. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది ఈ లఘు చిత్ర ట్రైలర్. చాలా చిత్రాలను తలదన్నే రీతిలో కట్ చేసిన ఈ ట్రైలర్ కు వస్తున్న స్పందనతో పూర్తి సినిమా ఎప్పుడు వస్తుందా అనే అంచనాలు భారీగా పెరిగాయి. అందరి అంచనాలకు ఫుల్ స్టాప్ పెడుతూ... బీప్ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్ షో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ ప్రీమియర్ షోకు పెళ్లి చూపులు చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి, ప్రముఖ నటులు నవీన్, రవి ప్రకాష్, చందు, అజయ్ తో పాటు ఆకతాయి చిత్ర దర్శకుడు రామ్ భీమన, అభినేత్రి చిత్ర మాటల రచయిత సత్య, కొరియోగ్రాఫర్ అమిత్ హాజరయ్యారు. వీరితో పాటు.. చిత్ర యూనిట్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరై చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు. 


నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.... దర్శకుడు సినిమాటిక్ బిల్డప్ ను బాగా క్రియేట్ చేశారు. షార్ట్ ఫిల్మ్స్ లోనే హై స్టాండర్స్ తో తెరకెక్కించారు. హీరో పెర్ ఫార్మెన్స్ చాలా బాగుంది. హీరోయిన్ ఆ క్యారెక్టర్ చేసేందుకు ధైర్యం కావాలి. చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్


హీరో కిషోర్ మారిశెట్టి మాట్లాడుతూ... చాలా కష్టపడి ఇష్టపడి చేశాం. ఈ సినిమాకు వర్క్ చేసిన వారందరిలో మంచి టాలెంట్ ఉంది. మాకున్న లిమిటెడ్ బడ్జెట్ లో... లిమిటెడ్ రిసోర్స్ తో ఈ సినిమా తీశాం. దర్శకుడు రాజ్ కి అద్భుతమైన టాలెంట్ ఉంది. గ్రేస్ తప్ప మరెవ్వరూ హీరోయిన్ క్యారెక్టర్ చేసేందుకు ఒప్పుకునే వారు కారేమో. సినిమాకు మ్యూజిక్, కెమెరా ప్రాణంగా నిలిచాయి. అన్ని డిపార్ట్ మెంట్స్ సమిష్టిగా పనిచేశాం కాబట్టే షార్ట్ ఫిల్మ్ ఇంత బాగా వచ్చింది. 


దర్శకుడు రాజ్ విరాట్ - నేను దర్శకుడిని కావాలనే ప్రయత్నంలో చేసిన షార్ట్ ఫిల్మ్ ఇది. కథ కంటే కూడా... నేను ఇలా తీయగలనని చూపించుకునేందుకే కాన్ సన్ ట్రేట్ చేశాం. మీ అందరికీ నచ్చినందుకు చాలా థాంక్స్, నేను ఎలా కావాలనుకున్నానో అలా వచ్చిందంటే కారణం ఆర్టిస్టుల టెక్నీషియన్స్ సపోర్ట్ వల్లే సాధ్యమైంది. 


హీరోయిన్ గ్రేస్ మాట్లాడుతూ... ముందుకు దర్శకుడు రాజ్ కి చాలా థాంక్స్, హీ ఈజ్ ది బెస్ట్. నా బెస్ట్ కో స్టార్ కిషోర్. నేను ఇలా చేయగలనని నాకే తెలియదు. షార్ట్ ఫిల్మ్ ని నచ్చి ప్రోత్సహిస్తున్న అందరికీ చాలా థాంక్స్. 


దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ... ఫారిన్ ఫిల్మ్ చూసిన ఫిల్మ్ కలిగింది. ఎడిటింగ్ చాలా అద్భుతంగా ఉంది. బీప్ లో ఒకరికి ఒకరు పోటీ పడుతూ చేశారు. కిషోర్ నాకు బ్రదర్ లాంటి వాడు. ఆకతాయి సినిమాలో కూడా చేశాడు. చాలా బాగా చేశాడు. బ్రిలియంట్ యాక్టర్. డైరెక్షన్ ఫారిన్ ఫిల్మ్ చూసినట్టుగా ఉంది. చైతు, గ్రేస్ చాలా బాగా చేశారు. పెద్ద సినిమా చేసిన ఫీలింగ్ కలిగింది. ఇదే ప్యాటర్స్ లో సినిమా చేస్తే కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. 


కొరియోగ్రఫర్ అమిత్ - మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ చాలా బాగుంది. గ్రేస్, చైతు అద్భుతంగా చేశారు. కిషోర్ హీరోగా పెద్ద సినిమా చేయాలని కోరుకుంటున్నాను. 


నటుడు నవీన్ మాట్లాడుతూ... హీరోయిన్ ను చూస్తే భయమైంది. టీం అంతా చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ టు ది టీం బీప్. 


నటుడు రవి ప్రకాష్ మాట్లాడుతూ... బీప్ షార్ట్ ఫిల్మ్ లా కాకుండా సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. కిషోర్ తో పాటు ఆర్టిస్టులంతా చాలాబాగా చేశారు. డైరెక్టర్ కి మంచి ఫ్యూచర్ ఉంది. అని అన్నారు. 


నటీనటులు - కిషోర్ మారిశెట్టి, గ్రేస్, చైతు సోఫి, జయసింహ సన్నీ ఈదర, హరీష్ రోషన్, లీలా వెంకటేష్ కొమ్మురి, శ్రీ కృష్ణ


సాంకేతిక వర్గం

లోగో, టైటిల్ డిజైన్ - కార్తిక్ నందన్

యాక్షన్ కొరియోగ్రఫి - రాజ్ విరాట్

ఎడిటర్, విఎఫ్ఎక్స్, డీఐ, పోస్టర్స్ - కార్తిక్ నందన్

సినిమాటిక్ యాక్షన్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ డిజైన్ - షఫి

ఆడియో గ్రఫి - కబిర్ రఫి

కో రైటర్ అండ్ లిరిక్స్ అరున్ జయరాం

మేకప్ - ప్రవీణ్

ప్రొడక్షన్ కంట్రోలర్ - స్వరూప్ హర్ష, మైనేని దిన్ను

వోకల్స్ - శ్రీ హర్ష మండ, ఆనంద విజయ్

అసిస్టెంట్ డైరెక్టర్స్ - అఖిల్ రాజ్, స్వరూప్ హర్ష, మైనేని దిన్ను

మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - పెనుమత్స వెంకట రామరాజు

సినిమాటోగ్రాఫర్ - అనుష్ కుమార్.పి

ప్రొడ్యూసర్ - డ్రీమ్ వింగ్స్ ప్రొడక్షన్

స్టోరీ, స్క్రీ న్ ప్లే, డైలాగ్స్ అండ్ డైరెక్షన్ - రాజ్ విరాట్