‘టాక్సీవాలా’ మూవీ రివ్యూ

0
300

గీతా గోవిందం త‌ర్వాత నోటా లాంటి బిగ్ డిజాస్ట‌ర్ తో దెబ్బ‌తిన్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు ‘టాక్సీవాలా’ గా వ‌స్తున్నాడు. ఎప్పుడో స‌మ్మ‌ర్ లో రిలీజ్ అవాల్సిన ఈ సినిమా అనేక లీకులను ఎదుర్కొని పోస్ట్‌పోన్ అవుతూ వ‌చ్చి.. ఎట్ట‌కేల‌కు ఇవాళ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. మ‌రి టాక్సీవాలా తో విజ‌య్ మ‌ళ్లీ ఇంకొక విజ‌యం చేజిక్కించుకున్నాడా లేదా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.

చ‌దువు అయ్యి 5 ఏళ్ళు అవుతున్నా ఉద్యోగం లేని హీరో అనేక చిన్న చితకా జాబ్స్ ట్రై చేసినా ఏవి సెట్ కావు. అలాంటి సమయంలో ఒక టాక్సీ అమ్మకానికి రావడంతో ఆ టాక్సీ ని కొనుక్కుని కాబ్ లాగా నడుపుతూ జీవితాన్ని కొనసాగిస్తుండగా అనుకోకుండా ఆ టాక్సీ లో ఒక ఆత్మ ఉందని తెలుసుకుంటాడు. ఆ ఆత్మ ఆ టాక్సీ లోకి ఎందుకు వచ్చింది… వచ్చాక హీరో ఏం చేశాడు అన్నది అసలు కథ.

విజయ్ దేవరకొండ ఎప్పటి లానే తన పాత్ర‌లో ఇమిడిపోయి అద‌ర‌గొట్టాడు. సింగిల్ లైన్ డైలాగ్స్ తో లైట్ నోటెడ్ కామెడీ సీన్స్ తో మొదటి అర్ధభాగం ఆకట్టుకోగా హీరో హీరోయిన్స్ లవ్ స్టోరీ కూడా బాగానే మెప్పించింది. హీరోయిన్ ప్రియాంక లుక్స్ అండ్ నటన ఒకే అనిపిస్తాయి. మిగిలిన నటీనటులు తమ పరిది మేర నటించి మెప్పించగా సినిమా మొత్తం విజయ్ దేవరకొండ మార్క్ సీన్స్ పెద్దగా లేకున్నా ఉన్నంతలో నటనతో ఆకట్టుకుని సినిమాని తన భుజాన మోసి చాలా వరకు మెప్పించాడు విజయ్ దేవరకొండ. భ‌య‌ప‌డే సీన్స్ లో కూడా మెప్పించగలిగాడు.

త‌ను తీసుకున్న పాయింట్ ని దాదాపు మెప్పించినా కానీ చివరి 30 నిమిషాల ఎపిసోడ్ కొంత బోర్ కొడుతుంది. ఏదో క్లైమాక్స్ ఉండాల‌న్న‌ట్లు ఉండ‌కుండా కాస్త జాగ్ర‌త్త‌గా డీల్ చేసి ఉంటే బావుండేది. విజ‌య్ కు ఉన్న క్రేజ్ ను వాడుకోకుండా జ‌స్ట్ సినిమాకు ఎంత కావాలో అంతే వాడుకున్నాడు త‌ప్పించి విజ‌య్ ను స‌రిగ్గా వాడుకోలేదు. కానీ డైర‌క్ష‌న్ బావుంద‌ని చెప్పొచ్చు. కెమెరామెన్ పనితనం బాగుంది, విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. సంగీతం విషయం లో మాటే వినధుగా సాంగ్ టోటల్ సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. మిగిలిన పాటలు పర్వాలేదు అనిపిస్తాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమా ఫీల్ కి తగ్గట్లు ఉంది. ఎడిటింగ్ బాగానే ఉన్నా చివరి 30 నిమిషాలు మరింత షార్ప్ గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్లున్నాయి.

పంచ్‌లైన్ః స‌ర‌దాగా సాగే రైడ్
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here