విజయ్ దేవరకొండ పాత్రలో తమిళ్ స్టార్

0
955

విజయ్ దేవరకొండ.. లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్.. షార్ట్ టైమ్ లో లార్జ్ ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండకు బాలీవుడ్ లోనూ ఓ రేంజ్ క్రేజ్ ఉంది. అక్కడ ఒక్క సినిమా కూడా చేయకుండానే ఇంత క్రేజ్ రావడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొందరు హీరోయిన్లు సైతం విజయ్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారక్కడ. అందుకే అతన్ని ఓ బాలీవుడ్ సినిమాలోతీసుకోవాలనే ప్రయత్నాలు జరిగాయి. దీంతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ కు వెళుతున్నాడని తెలుగు మీడియాలోనూ చాలా వార్తలు వచ్చాయి. కానీ అతను వెళ్లడం లేదని లేటెస్ట్ గా ఓ తమిళ యంగ్ హీరో చెప్పడం విశేషం.

ఇండియన్ క్రికెటర్ కపిల్ దేవ్ నేతృత్వలో 1983లో క్రికెట్ కప్ నెగ్గిన జట్టు కథను తెరకెక్కిస్తున్నారు. కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ నటిస్తున్నాడు. అయితే ఆ టీమ్ కీలక సభ్యుడుగా ఉన్న కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడా పాత్ర తను చేస్తున్నట్టు ప్రకటించాడు రంగం ఫేమ్ జీవా. తెలుగు మూలాలున్న ఈ హీరో తమిళ్ కొన్నాళ్ల క్రితం స్టార్ మెటీరియల్ అనిపించుకున్నాడు. మధ్యలో హిట్లు తప్పాడు. కానీ ప్రస్తుతం వరుసగా కొన్ని సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి హిప్పీ..

రీసెంట్ గా ఆర్ఎక్స్ 100తో తెలుగులో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ కూడా హిప్పీ సినిమాలో నటిస్తున్నాడు. అంటే సేమ్ మూవీ రెండు భాషల్లో ఇద్దరు హీరోలు చేస్తున్నారన్నమాట. జీవా నటిస్తోన్న ఈ తమిళ్ హిప్పీ టీజర్ విడుదలైంది. అద్భుతమైన స్పందన కూడా వచ్చింది. మొత్తంగా విజయ్ దేవరకొండ చేస్తున్నాడనుకున్న పాత్రలో జీవా చేస్తున్నాడు. ఇందుకోసం తనకు ఇంటికే వచ్చి ఓ రియల్ క్రికెటర్ క్రికెట్ నేర్పిస్తున్నాడట. సో.. విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఈ మూవీతో కాదన్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here