అల్లు అర్జున్ అమ్మగా మాజీ హాట్ బ్యూటీ

0
2706
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతోన్న మూవీ రోజు రోజుకూ టాక్ ఆఫ్ ది కాస్ట్ అవుతోంది. అంటే ఈ సినిమాలో నటించే కాస్ట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారన్నమాట. ఇప్పటికే మళయాల నటుడు జయరామ్(అనుష్క భాగమతిలో నటించాడు) సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్ వంటి వారిని తీసుకున్నాడు త్రివిక్రమ్. అయితే ఇది మేజర్ గా ఫాదర్ సెంటిమెంట్ తో నడిచే సినిమా అంటున్నారు. కానీ మదర్ క్యారెక్టర్ కు కూడా సమాన ప్రాధాన్యత ఉంటుందట. అందుకే అల్లు అర్జున్ కు అమ్మగా మాజీ హాట్ బ్యూటీ మోస్ట్ టాలెంటెడ్ లేడీ ముఖ్యంగా హైదరాబాదీ భామ టబును తీసుకోబోతున్నారట.
ఇప్పటికే తన సినిమాల్లో మాజీ హీరోయిన్లకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఇచ్చి వారి కెరీర్ కు కొత్త టర్నింగ్ ఇచ్చిన త్రివిక్రమ్ ఈ సారి టబును టార్గెట్ చేసినట్టున్నాడు. అంటే నిజంగానే తను ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంటే ఈ సినిమా సూపర్ హిట్ అయితే ఖచ్చితంగా టబుకు ఇది తెలుగులో స్పెషల్ ఇన్నింగ్స్ గా మారుతుంది. లేదా సౌత్ లోనూ తనకోసం ప్రత్యేక పాత్రలు వస్తాయి. ఇప్పటికైతే మూవీ టీమ్ టబుతో చర్చలు జరుపుతున్నట్టు చెబుతున్నారు. తనకు కథ నచ్చితే చేయడానికి పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. ఇప్పటికే షాహిద్ కపూర్ వంటి వారికి స్టెప్ మదర్ గా నటించింది తను. మరి తను ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. మరోవైపు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మరి అంతా బానే ఉంది కానీ.. మరీ ఇంత స్టార్ కాస్ట్ ఉంటే అసలు స్టార్ సైడ్ అయిపోతాడేమో చూసుకో త్రివిక్రమ్..