సూర్యకాంతం రివ్యూ

0
281
మెగా వార‌సురాలు నిహారిక కొణిదెల ఒక మ‌న‌సు తో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసిన‌ప్ప‌టికీ, సినిమాలో త‌న న‌ట‌న‌కు మంచి మార్కులైతే ప‌డ్డాయి కానీ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం బోల్తానే కొట్టింది. త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకుని హ్యాపీ వెడ్డింగ్ చేసి ఆ సినిమాతో అయినా విజ‌యం సాధిద్దామ‌నుకున్నప్ప‌టికీ, అది కూడా ప‌రాజ‌యం పాలైంది. ఇప్పుడు మ‌ళ్లీ గ్యాప్ తీసుకుని ముద్ద పప్పు ఆవ‌కాయ్ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేసిన ప్ర‌ణీత్ ద‌ర్శ‌క‌త్వంలో ఇప్పుడు సూర్య‌కాంతం తో మ‌రోసారి ప్రేక్షకుల ముందుకొచ్చి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుంది. మ‌రి ఈ సినిమా అయినా నిహారిక కు విజ‌యాన్ని అందించిందా లేదా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.
అభి(రాహుల్ విజ‌య్‌) ..సూర్య‌కాంతం(నిహారిక‌)ను చూసి ప్రేమిస్తాడు. స‌ర‌దాగా ఆడుతూ పాడుతూ ఉండే సూర్య‌కాంతంను పెళ్లి చేసుకోమ‌ని ఆమె త‌ల్లి(సుహాసిని) పోరు పెడుతుంటుంది. అయితే సూర్య‌కాంతం క‌మిట్‌మెంట్ ఫోబియో కార‌ణంగా పెళ్లి నుండి త‌ప్పించుకుని తిరుగుతూ ఉంటుంది. ఓరోజు సూర్య‌కాంతం త‌ల్లికి హార్ట్ ఏటాక్ రావ‌డంతో చ‌నిపోతుంది. దీంతో సూర్య‌కాంతం ఇంకా ఒంటరిగా మిగులుతుంది. అభి ఆమెకు అండ‌గా నిల‌బడ‌తాడు. ఓ రోజు సూర్య‌కాంతంను ప్రేమించిన అభి ఆమెకు త‌న ప్రేమ‌ను చెబుతాడు. కానీ సూర్య కాంతం మ‌రుస‌టి రోజు నుండి క‌న‌ప‌డ‌దు. ఎక్క‌డికి వెళుతుందో కూడా తెలియ‌కుండా వెళ్లిపోతుంది. దాదాపు సూర్యకాంతం ఏడాది వ‌ర‌కు క‌న‌ప‌డ‌దు. దాంతో ఇంట్లో చూసిన అమ్మాయి పూజ (పెర్లెన్ బెసానియా)ను పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతాడు. రెండు రోజుల్లో అభి, పూజ‌ల‌కు నిశ్చితార్థం ఉంద‌నే స‌మ‌యంలో సూర్య‌కాంతం మ‌ళ్లీ ఎంట్రీ ఇస్తుంది. అస‌లు తాను పూజ‌ను పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు సూర్య‌కాంతంకు అభి చెప్ప‌లేదు. ఓరోజు సూర్య‌కాంతం .. అభికి ఐ ల‌వ్ యూ చెబుతుంది. అప్పుడు అభి.. త‌నకు పూజ‌కు జ‌ర‌గ‌బోయే పెళ్లి గురించి చెబుతాడు. సూర్య‌కాంతం అప్పుడేం చేస్తుంది? సూర్య‌కాంతం గురించి పూజ‌కు ముందే తెలుసా? చివ‌ర‌కు అభి ఎవ‌రిని పెళ్లి చేసుకుంటాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

నిహారిక కు సూర్య‌కాంతం లాంటి ఎన‌ర్జిటిక్ క్యారెక్ట‌ర్ దొరికితే ఎంత రెచ్చిపోయి నటిస్తుందో ఈ సినిమాలోని త‌న న‌ట‌నే కార‌ణం. ప్ర‌తీ సీన్ ను భ‌లే పండించింది. ఒక మ‌న‌సు, హ్యాపీ వెడ్డింగ్ లో హోమ్లీ గా క‌నిపించిన నిహారిక ఈ సినిమాలో అల్లరి పిల్ల‌గా బాగా ఆక‌ట్టుకుంది. అభి పాత్ర‌లో రాహుల్ సెట్ అయ్యాడు. సెకండ్ హీరోయిన్ పెర్లెన్ అందంతో పాటు, అభిన‌యంతోనూ ఆకట్టుకుంది. సుహాసిని పాత్ర ఉన్నంత‌లో ఆక‌ట్టుకుంటుంది. శివాజీ రాజా, స‌త్య, మిగిలిన పాత్ర‌లు త‌మ ప‌రిధి మేర‌కు ఆక‌ట్టుకున్నారు.

ముద్ద ప‌ప్పు ఆవ‌కాయ్ వెబ్ సిరీస్ తో ఆల్రెడీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ద‌ర్శ‌కుడు ప్ర‌ణీత్ ఈసారి కూడా అలాంటి కాన్సెప్ట్ నే ఎంచుకున్నాడు. కొన్ని కొన్ని సీన్స్ అయితే బాగా పేలాయి కానీ మిగిలిన స‌న్నివేశాల‌న్నీ తేలిపోయాయి. సెకండాఫ్ లో అయితే అసలు ఏం జ‌రుగుతుందో కూడా తెలీకుండా స్లో నెరేష‌న్ తో ప్రేక్ష‌కుడికి చిరాకు తెప్పించాడు. ఫస్ట్ హాఫ్ లో కాంతం పాత్ర‌తో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు సెకండాఫ్ లో దాన్ని మిస్ చేయ‌డ‌మే కాకుండా అస‌లు ఆ పాత్ర ఎలా బిహేవ్ చేస్తుందో కూడా తెలీని స్థితిలో ఉండేలా డిజైన్ చేసి క‌న్‌ఫ్యూజ్ చేస్తాడు. సినిమాటోగ్ర‌ఫీ బావుంది. మార్క్ అందించిన సంగీతం బావుంది. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
నిహారిక న‌ట‌న‌
కొన్నికొన్ని ఎంట‌ర్‌టైన్‌మెంట్ సీన్స్

మైన‌స్ పాయింట్స్ః
రొటీన్ స్టోరీ
స్లో సెకండాఫ్

పంచ్‌లైన్ః సూర్య‌కాంతానికి రీలాంఛ్ త‌ప్పేలా లేదు..!
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5