‘సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం’ మూవీ రివ్యూ

0
1471

‘మ‌ళ్లీ రావా’ తో విజ‌యం అందుకున్న సుమంత్ దాన్ని నిల‌బెట్టుకోవాల్సిన స‌మ‌యంలో త‌నెప్పుడూ చేయ‌ని జాన‌ర్ లో సినిమాను చేస్తున్నాడు. ఆల్రెడీ టీజ‌ర్, ట్రైల‌ర్ తో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ‘సుబ్ర‌హ్మ‌ణ్యపురం’ సుమంత్ ను విజ‌యాన్ని అందించిందా లేదా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.

సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం అనే గ్రామంలో సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌రుని ప్రాచీన ఆలయముంది. ఆ ఆల‌యంలో విగ్ర‌హానికి అభిషేకం నిషేధంగా ఉంటుంది. అయితే ఓ వ్య‌క్తి విగ్ర‌హానికి అభిషేకం చేసి గుడిలో ఆత్మ‌హ‌త్య చేసుకుని చనిపోతాడు. అదే స‌మయంలో ఊర్లో కొంత‌మందికి సుబ్ర‌హ్మ‌ణ్య‌పుర స్వామి వాహ‌న‌మైన నెమ‌లి క‌న‌ప‌డుతుంది. వెంట‌నే వాళ్లు ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోతుంటారు. దాంతో స్వామి ఊరిని శ‌పించాడ‌నే పుకారు పుడుతుంది. ఊరిని ఖాళీ చేయాల‌నుకుంటారు. ఊరి పెద్ద వ‌ర్మ‌(సురేశ్‌) స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించాలో తెలియ‌క ఇబ్బంది ప‌డుతుంటాడు.
క‌థ ఇలా సాగుతుండ‌గా పురాత‌న ఆల‌యాల‌పై ప‌రిశోధ‌న చేసే కార్తీక్‌(సుమంత్‌) అనే స్కాల‌ర్‌కి దేవుడంటే పెద్ద‌గా న‌మ్మ‌కం ఉండ‌దు. సిటీలో కార్తీక్‌.. అక్క‌డే చ‌దువుకుంటున్న‌ ప్రియ‌ (ఈషా రెబ్బా) ప‌రిచ‌యం అవుతుంది. ఇద్ద‌రూ ప్రేమించుకుంటారు. ఆమె తండ్రితో మాట్లాడాల‌నుకుని సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం చేరుకున్న కార్తీక్‌కి అక్క‌డి ఆత్మహ‌త్య‌లు గురించి తెలుస్తాయి. అప్పుడు అత‌నేం చేస్తాడు? ఊరి స‌మ‌స్య వెనుకున్న కార‌ణ‌మేంటి? అందుకు కార‌ణ‌మేంటనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

హేతువాది పాత్రలో సుమంత్‌ సుమంత్‌ బాగా చేశాడు. సత్యం, మళ్లీరావా లాంటి సినిమాల్లో కూల్‌ పర్ఫామెన్స్‌ ఇచ్చిన సుమంత్‌ ఈ చిత్రంలో తన నటనలోని మరో కోణాన్ని చూపించారు. ఇక ప్రియా పాత్రలో నటించిన ఈషా రెబ్బ ఉన్నంతలో బాగానే ఆకట్టుకుంది. సుమంత్‌ స్నేహితులుగా నటించిన భద్రం, జోష్‌ రవి ఫర్వాలేదనిపించారు. మ‌రో స్నేహితురాలిగా హ‌ర్షిణి మెప్పించింది. సాయి కుమార్‌, ఎస్సై పాత్రలో అమిత్‌ శర్మ, గిరి, గ్రామ పెద్దగా సురేష్‌ తమ పరిధిమేరకు మెప్పించారు.

దేవుడు- మ‌నిషి ఈ కాన్సెప్ట్ ని స‌రిగ్గా వాడుకోవాలే కానీ ఎప్ప‌టికీ స‌క్సెస్ అయ్యేదే. వాస్త‌వాల‌కు- ఊహ‌ల‌కు.. న‌మ్మ‌కాల‌కు- నిజాల‌కు మ‌ధ్య అల్లే క‌థ ప్రేక్ష‌కుల‌ను ఎప్పుడూ ఆక‌ట్టుకుంటుంది. ఇదివర‌కు ఈ ఫార్ములాతో ఎన్ని సినిమాలొచ్చినా.. సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. మామూలుగా ఇలాంటి సినిమాల‌కు స్క్రీన్ ప్లే వేగ‌మే ముఖ్యం. ఈ చిత్రంలో కాస్త అది స్లో గా సాగినట్లు అనిపిస్తుంది. సినిమాటోగ్ర‌ఫీ ఫ‌ర్వాలేదు. శేఖ‌ర్ చంద్ర సంగీతం, రీరికార్డింగ్ చాలా బావున్నాయి. ఎడిటర్ త‌న క‌త్తెర‌కు ఇంకాస్త శ్ర‌ద్ధ పెట్టాల్సింది. సినిమా స్థాయికి మించి ఎక్క‌డా వెనుకాడ‌కుండా మంచి నిర్మాణ విలువ‌లు పాటించారు.

పంచ్‌లైన్ః థ్రిల్లర్ లో మిస్ అయిన థ్రిల్
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here