శ్రీనివాస రెడ్డి ‘అతి’కి మూల్యమా ఇది

0
870
కమెడియన్ గా అద్భుతమైన టైమింగ్ ఉన్న ఆర్టిస్టుల్లో శ్రీనివాసరెడ్డి ఒకడు. ఆ మధ్య హీరోగా మారిన తర్వాత మనోడి యాటిట్యూడ్ లో చాలా మార్పు వచ్చిందని ఎవరైనా చెబుతారు. హీరోగా చేస్తూనే కమెడియన్ గానూ నటిస్తోన్నా.. ఈ మధ్య శ్రీనివాస రెడ్డి నటనలో ‘అతి’ఓవర్ గా కనిపిస్తోంది. చాలా సీన్ కు మించిన బిల్డప్ అతని నటనలో కనిపిస్తోంది. దీంతో ఈ మధ్య అతని  కామెడీకి మునుపటిలా నవ్వు రావడం లేదు సరికదా.. మరీ ఇంత ఓవరాక్షన్ అవసరమా అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. అందుకే లేటెస్ట్ గా వచ్చిన ‘ఎఫ్-2’ లో అతని పాత్రకు ఏ ప్రాధాన్యం లేకుండా పోయింది. నిజానికి అనిల్ రావిపూడి సినిమాల్లో శ్రీనివాస రెడ్డికి మంచి స్కోప్ ఉంటుంది.
పటాస్ లో పోలీస్ గా సుప్రీమ్ లో పోసాని కాంబినేషన్ లో సన్నాయి వాయించేవాడిగా.. రాజా ది గ్రేట్ లో రవితేజ ఫ్రెండ్ గా మంచి పాత్రలు చేశాడు శ్రీనివాస రెడ్డి. కానీ ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోన్న అతి వల్లో లేక ఇది కూడా వర్కవుట్ అవుతుందనుకున్న దర్శకుడి నమ్మకం వల్లో కానీ అతని పాత్ర ఎఫ్ -2లో పూర్తిగా తేలిపోయింది. ఇంకా చెబితే అతను సినిమాలో ఉన్నాడనే ముద్ర కూడా లేదు. మామూలుగా తన టైమింగ్ తో సింగిల్ సీన్ తో కూడా ముద్ర వేయగల టాలెంటెడ్ అయిన శ్రీనివాస రెడ్డిని ఇలా కార్నర్ చేయడం వెనక ఇంకేదైనా కారణం ఉంటుందా అనేది తెలియదు. కానీ ఈ మధ్య అతను చేస్తోన్న ‘అతి’కి చెల్లించిన మూల్యంగా మాత్రం ఈ సినిమా కనిపిస్తోంది. మరి ఇకనైనా ఆ ఓవరాక్షన్ తగ్గించుకుంటాడా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here