Tuesday, March 19, 2019
Home News Entertainment news రాజమౌళికి శ్రీదేవి కూతురు నో చెప్పిందా..?

రాజమౌళికి శ్రీదేవి కూతురు నో చెప్పిందా..?

0
2491
రాజమౌళి లేటెస్ట్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తోన్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ లో హీరోయిన్ల మేటర్ ముందు నుంచీ కన్ఫ్యూజింగ్ గానే ఉంది. ఎవరికి తోచినట్టుగా వాళ్లు మాట్లాడేసుకుంటున్నారు. ఆ హీరోయిన్ ఓకే అయింది ఈ హీరోయిన్ ఓకే అయిందని రోజుకో బ్యూటీని తెస్తున్నారు రూమర్ రాయుళ్లు. ఆ బ్యూటీస్ లో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కూడా ఉంది. అయితే ఈ టీమ్ నుంచి జాన్వీని ఎవరూ సంప్రదించలేదనేది నిజం.. అయినా తను ఈ టీమ్ లోకి వస్తే బావుంటుందని కోరుకునేవాళ్లూ చాలామందే ఉన్నారు. గతంలోనే చిరంజీవి కూడా శ్రీదేవి కూతురు, తన కొడుకు కలిసి జగదేకవీరుడు అతిలోక సుందరి రీమేక్ చేస్తే చూడాలని ఉంది అన్నాడు. ఆ సినిమానే కాకపోయినా ఇప్పుడీ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ నటిస్తే చూడాలనుకుంటున్నారు. బట్.. అసలు విషయం ఏంటంటే.. ఈ సినిమాలో నటించేందుకు అసలు జాన్వీకే ఇంట్రెస్ట్ లేదట. ఒకవేళ వాళ్లు అప్రోచ్ అయినా నో చెప్పేందుకే సిద్ధంగా ఉందంటోంది బాలీవుడ్.
గతంలో బాహుబలిలో రమ్యకృష్ణ పాత్రలో నటించేందుకు ముందు రాజమౌళి శ్రీదేవిని అప్రోచ్ అయ్యాడనీ.. తను ఎన్నో గొంతెమ్మ కోరికలు కోరడంతో రమ్యకృష్ణను తీసుకున్నాం అని చెప్పాడు. కానీ కొన్నాళ్ల తర్వాత శ్రీదేవి ఆ మాటలను ఖండించడమే కాదు.. ఇన్ డైరెక్ట్ గా రాజమౌళిపై పెద్ద సైటైర్సే వేసింది. మొత్తంగా ఆ టైమ్ లో ముందుగా శ్రీదేవి ఈ సినిమాలో చేయనందుకు చాలామంది తెగ ట్రోల్ చేశారు. అందుకు కారణం శ్రీదేవి గురించి రాజమౌళి చెప్పిన మాటలే. తన తల్లిని అవమానించిన కారణంగా రాజమౌళి సినిమాలో నటించకూడదని జాన్వీ అనుకుంటోందట. అందుకే ఒకవేళ తనను ఈ ప్రాజెక్ట్ కు అప్రోచ్ అయినా నో చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మరి ఇందులో నిజాలెన్ని అనేది త్వరలోనే తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by :