అమ్మ ఇచ్చిన ప్రోత్సాహమే నా సక్సెస్ కి కారణం – నిర్మాత ఆదిత్య రామ్

0
180
ఎప్పుడూ హార్డ్ వర్క్ చేయాలన్నదే అమ్మ పాలసీ. అలాగే నీతో పాటూ నీ చుట్టూ ఉన్నవాళ్ళందరినీ ఆనందంగా ఉంచేలా జీవించు అన్న అమ్మ మాటలని అక్షరాలా పాటిస్తాను. నేను ఈ రోజు ఇంత సక్సెస్ అవడానికి అమ్మ ప్రోత్సాహమే కారణం. ” అన్నారు ప్రముఖ నిర్మాత, ఆదిత్యరామ్ స్టూడియోస్ అధినేత, ఆదిత్య గ్రూప్ అఫ్ కంపెనీస్ చైర్మన్ ఆదిత్యరామ్. ఆదివారం ఆదిత్యరామ్ తల్లి శ్రీమతి పి.లక్ష్మి (70) కన్నుమూశారు. ఆవిడ అంత్యక్రియల్ని ఆదివారం సాయంత్రమే చెన్నై లోని తన ఆదిత్య నగర్ లో ప్రైవేట్ గ్రౌండ్ లో జరిపారు. సందడే సందడి, ఖుషి ఖుషీగా, స్వాగతం, ఏక్ నిరంజన్ వంటి హిట్ చిత్రాలు నిర్మించిన ఆదిత్యరామ్ తన అమ్మకి సినిమాలంటే ఎంతో ఇష్టమని, ఆవిడ కోరికపైనే నిర్మాతగా మారానని అన్నారు. త్వరలో తాను నిర్మించనున్న రెండు భారీ చిత్రాలని అమ్మకి అంకితం ఇవ్వబోతున్నట్లు ఆదిత్యరామ్ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here