‘Silly Fellows’ Movie Review

0
279

అల్ల‌రి నరేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బ్ల‌స్ట‌ర్ అయిన సుడిగాడు ద‌ర్శ‌కుడు భీమ‌నేని శ్రీనివాసరావు తో క‌లిసి ఆరేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ తీసిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. గ‌తంలో మంచి విజ‌యాన్ని అందించిన భీమ‌నేని శ్రీనివాసరావు ఈసారి కూడా న‌రేష్ కు అంతే విజ‌యాన్ని అందించాడా? క‌మెడియ‌న్ గా సునీల్ రీఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏమేర ఆక‌ట్టుకుందో రివ్యూ లో చూద్దాం.

క‌థః
వీర‌బాబు (అల్ల‌రి న‌రేశ్‌) లేడీస్ టైల‌ర్‌. ఎప్ప‌టికైనా ఎమ్మెల్యే కావాల‌నేది అత‌ని క‌ల‌. స్థానికంగా చిన్న హోట‌ల్ పెట్టుకుని న‌డుపుతున్న ఓ మ‌హిళ (ఝాన్సీ) కూతురు (చిత్ర శుక్ల‌) ను ప్రేమిస్తాడు. ఆ అమ్మాయికి పోలీస్ కావాల‌నేది కోరిక‌. వీర‌బాబు ఫ్రెండ్ సూరిబాబు (సునీల్). అనుకోకుండా పుష్ప (నందినిరాయ్‌) మెడ‌లో తాళి క‌డ‌తాడు. ఆమెతో తెగ‌తెంపులు చేసుకుని వ‌స్తేనేగానీ, పెళ్లిచేసుకోన‌ని సూరి అస‌లు గ‌ర్ల్ ఫ్రెండ్ ష‌ర‌తు పెడుతుంది. అక్క‌డి నుంచి సూరి విడాకుల కోసం పుష్ప వెంట ప‌డ‌తాడు. త‌ను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే వీర‌బాబుకు ఓ చిక్కు వ‌చ్చి ప‌డుతుంది. దాన్ని ఎలా విడిపించుకున్నాడు? మ‌ధ్య‌లో ఎమ్మెల్యే గొడ‌వ ఏంటి? మినిస్ట‌ర్ బావ‌మ‌రిది ఎవ‌రు? ఇంకో కిరాయి ముఠా ఎవ‌రు? రూ.500కోట్ల సంగ‌తి ఏంటి? వ‌ంటివ‌న్నీ మిగిలిన సినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంది.

న‌టీన‌టుల ప్ర‌తిభః
కామెడీ హీరోగా మంచి పేరున్న అల్ల‌రి న‌రేష్ మ‌రోసారి త‌న ఇమేజ్ కు త‌గ్గ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. కానీ కొత్త‌ద‌న‌మేమీ లేకుండా త‌న‌కు అల‌వాటైన పాత ఫార్ములేనా ఫాలో అవుతూ, వీర‌బాబు క్యారెక్ట‌ర్ కు పూర్తి న్యాయం చేశాడు. క‌మెడియ‌న్ గా సునీల్ త‌న‌పాత్ర కు ఫ‌ర్వాలేద‌నిపించాడు. హీరోయిన్ గా చిత్ర శుక్లా ఓకే. వాసంతి క్యారెక్ట‌ర్ లో యాక్ష‌న్ సీన్స్ లో కూడా ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. బిగ్ బాస్ ఫేమ్ నందిని రాయ్ న‌ట‌న చేయ‌క‌పోగా, నిరాశ‌ప‌రిచింది. జెపీ, పోసాని, రాజా ర‌వీంద్ర రొటీన్ పాత్రల్లోనే క‌నిపించారు.పూర్ణ గెస్ట్ రోల్ లో మెరిసి స‌ర్‌ప్రైజ్ ఇస్తుంది. బ్ర‌హ్మానందం కామెడీ పెద్ద‌గా ఏం న‌వ్వించ‌దు. మిగిలిన వారు ఎవ‌రి పాత్ర‌ల ప‌రిధి మేర వారు చేశారు.

సాంకేతిక నిపుణులుః
త‌మిళ్ లో మంచి హిట్ అయిన సినిమాను తీసుకొచ్చి చిన్న చిన్న మార్పులు చేసి తెలుగు నేటివిటీకి స‌రిపోయేలా సిల్లీ ఫెలోస్ చిత్రాన్ని తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు భీమ‌నేని శ్రీనివాసరావు. సినిమాలో లాజిక్స్ వెత‌కొద్దు, జ‌స్ట్ కామెడీని ఎంజాయ్ చేయండ‌ని రిలీజ్ కు ముందే చెప్పారు బాగానే ఉంది. సినిమాలో అస‌లు లాజిక్స్ ఏమున్నాయని వెత‌కొద్ద‌న్నారో ప‌క్క‌న పెడితే స‌ర్లే వాళ్లు చెప్పిన‌ట్లే కామెడీని ఎంజాయ్ చేద్దామంటే అదీ ఉండ‌దు. అవే రొటీన్ డైలాగ్స్, అస్స‌లు ఆక‌ట్టుకోని పంచ్‌లు. స్టోరీ లైన బాగున్న‌ప్ప‌టికీ దాని చుట్టూ ద‌ర్శ‌కుడు అల్లిన క‌థ‌, కామెడీ ప్రేక్ష‌కుడిని మెప్పించ‌క‌పోగా , విసుగు తెప్పిస్తాయి. అస‌లు డీజీపీ ఇంటికి ఇద్ద‌రు సామాన్యులు నేరుగా వెళ్ల‌డం, ఆయ‌న‌తో ఇష్ట‌మొచ్చినట్లు గౌర‌వం లేకుండా మాట్లాడ‌టం చాలా సినిమాటిక్ గా అనిపిస్తుంది. ఎంత లాజిక్స్ వెత‌కొద్ద‌ని చెప్పినా మ‌రీ ఇలాంటి సీన్స్ ఉంటే చిన్న‌పిల్ల‌లు కూడా న‌వ్వుకుంటారు. సునీల్ లాంటి న‌టుడుని ఉంచుకుని కూడా స‌రిగా వాడుకోలేకపోయారు. సినిమాలో ఏమైనా నవ్వించే సీన్స్ ఉన్నాయా అంటే అవి జెపీ, పోసాని తో ఉన్న సన్నివేశాలే. సాంకేతికంగా సినిమా రిచ్‌గానే ఉంది. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. శ్రీ వ‌సంత ఇచ్చిన పాట‌లు బానే ఉన్నాయి. రీరికార్డింగ్ కూడా బావుంది. ఎడిటింగ్ ఫ‌ర్వాలేదు. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
అల్ల‌రి న‌రేష్
నువ్వు… పుష్ప మొగుడివా అనే డైలాగ్
జ‌య ప్ర‌కాష్ రెడ్డి ఏదైనా విష‌యాన్ని గుర్తు చేసుకునే విధానం

మైన‌స్ పాయింట్స్ః
క‌థ‌నం
స్లో్ నెరేష‌న్

పంచ్‌లైన్ః సిల్లీగానే ఉంటుంది!
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here