శేఖర్ కమ్ముల కొత్త సినిమా షురూ..

0
159

After blockbuster Fidaa Director Sekhar Kammula all set to start his next film with all newcomers. Formal Pooja was held today.Regular shoot of this Romantic Musical Lovestory will start from Dec

Presented by Amigos Creations, Produced by Narayan Das Narang, P Rammohan , Asian Cinemas

‘‘ఫిదా’’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత స్టార్ డైరెక్టర్ శేఖర్ క‌మ్ముల చేయ‌బోయే కొత్త సినిమా మొదలైంది..గ‌తంలో త‌న సినిమాల ద్వారా ఎంతో మంది
హీరోహీరోయిన్ల‌ను ప‌రిచ‌యం చేసిన శేఖ‌ర్ క‌మ్ముల త‌న త‌ర్వాతి సినిమాలో కూడా అంతా కొత్తవాళ్లనే నటింపజేయనున్నాడు. రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీ గా తెర‌కెక్కనున్న ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్టు, క్లాప్ బోర్డ్ పూజ కార్యక్రమాలు సోమవారం సికింద్రాబాద్ లోని గ‌ణేష్ ఆల‌యంలో జ‌రిగాయి. ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల తో పాటు నిర్మాతలు సునీల్ నారంగ్, పి.రామ్మోహన్,కో ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్,భరత్ నారంగ్,సదానంద్ పాల్గొన్నారు.. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అంతా పూర్తి చేసుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబ‌ర్ లో మొదలు కానుంది.. ఈ సినిమా ద్వారా ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘‘ఏషియ‌న్ గ్రూప్’’ నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది.నటీనటులు,మిగతా సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తారు. అమిగోస్ క్రియేషన్స్ స‌మ‌ర్ప‌ణ‌లో తెరకెక్కబోయే ఈ ప్రేమ క‌థ‌కునిర్మాత‌లు నారాయ‌ణ దాస్ నారంగ్ , పి. రామ్మోహ‌న్ (FDC Chairman). కో ప్రొడ్యూస‌ర్-విజ‌య్ భాస్క‌ర్‌, రచన‌-దర్శకత్వం:శేఖర్ కమ్ముల

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here