సంక్రాంతి విజేత వెంకీయేనా..?

0
894
ఈ సంక్రాంతి పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనేది నిజం. మొదటగా రిలీజ్ అయిన సినిమా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’కు మంచి టాక్ వచ్చింది. కానీ అందుకు తగ్గ కలెక్షన్స్ లేవు. ఈ పరిణామం చూసి సినిమా చేసిన వాళ్లే కాదు.. ఇండస్ట్రీలో కూడా చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇక రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ఊరమాస్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామను చూసి ఆడియన్స్ హాహాకారాలు పెడుతున్నారనేది అందరికీ తెలుసు. అటు రజినీకాంత్ పేటాకు టాక్ బావున్నా సరైన థియేటర్స్ లేకపోవడంతో పాటు ప్రమోషన్ కూడా లేకపోవడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ మూడు సినిమాల మధ్య నలిగిపోతుంది అనే నెగెటివ్ ఇంప్రెషన్ తో విడుదలైన ఎఫ్ -2 అనూహ్యంగా నవ్వులు పంచుతోంది.
కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమాలతోనే ఆకట్టుకుంటూ వస్తోన్న దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ -2కు బాక్సాఫీస్ వద్ద సరికొత్త జోష్ వస్తోంది. వెంకటేష్ కామెడీ టైటింగ్ కు తోడు వరుణ్ తేజ్ డిఫరెంట్ స్లాంగ్ కు కూడా ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇక హీరోయిన్లుగా నటించిన తమన్నా, మెహ్రీన్ కౌర్ ఇద్దరూ పోటీ పడి మరీ అందాల ప్రదర్శన చేయడంతో అటు గ్లామర్ పరంగానూ ఎఫ్ -2 హ్యాపీగా ఉంది. ఫస్ట్ హాఫ్ హిలేరియస్ గా సెకండ్ హాఫ్ కాస్త డోస్ తగ్గినా మొత్తంగా వెంకటేష్ ఈ సంక్రాంతికి విజేతగా నిలిచాడనేది ట్రేడ్ టాక్.

ఇక వినయ విధేయరామ డిస్ట్రిబ్యూటర్ గా లాస్ అవుతోన్న దిల్ రాజుకు నిర్మాతగా ఎఫ్ -2 హ్యాపీస్ నిస్తోంది. ఏదేమైనా మొదట్నుంచీ ఎఫ్ -2 పై పెద్దగా అంచనాల్లేవు. కానీ ఆ సినిమానే ఇప్పుడు సంక్రాంతి విజేత అనే టాక్ తెచ్చుకుంది. పండగకు ఫ్యామిలీ అంతా కూర్చుని హ్యాపీగా సినిమా చూసేయొచ్చు అనే టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు ఆడియన్స్ లుక్కంతా ఎఫ్ -2పైనే ఉందంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here