సందీప్ కిషన్ మరోటి పట్టాడండోయ్

0
903

సందీప్ కిషన్.. ఇన్నేళ్ల కెరీర్ లో ఒకే ఒక్క జెన్యూన్ హిట్ ఉన్న హీరో. అయినా సరే ఆఫర్స్ తగ్గడం లేదు అతనికి. మధ్యలో కొంత బ్రేక్ పడినా మళ్లీ వరుసగా బిజీ అవుతున్నాడు. అదీ తెలుగులోనే. ఈ గ్యాప్ లో తమిళ్ లో కొంత ఫర్వాలేదనిపించుకున్న సందీప్ కోసం మరోసారి అతని మేనమామ రంగంలోకి దిగుతున్నాడు. లేటెస్ట్ గా వస్తోన్న వార్తలను బట్టి సందీప్ ఏకంగా ఒకేసారి రెండు సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. వీటిలో ఒకటి ‘సుబ్రహ్మణ్యపురం’ దర్శకుడు సంతోష్ జాగర్లమూడితో ఉంటుంది. సుబ్రహ్మణ్యపురం చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి. కానీ క్రిటికల్ గా మాత్రం కార్తికేయ సినిమాలా ఉందనే కామెంట్స్ వచ్చాయి. ఆశ్చర్యంగా ఇప్పుడీ చిత్రాన్ని కార్తికేయ నిర్మాతే నిర్మించబోతున్నాడు. సింపుల్ గా చెబితే సందీప్ కిషన్ హీరోగా సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో కార్తికేయ ఫేమ్ వెంకట్ శ్రీనివాస్ బొగ్గారం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో పాటు మరో చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశాడు సందీప్. ఈ మూవీకి జి నాగేశ్వరరెడ్డి దర్శకుడు. మరో విశేషం ఏంటంటే.. ఈ మూవీలో తమిళ్ నటి విశాల్ మాజీ లవర్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. హన్సిక హీరోయిన్. శామ్ కె నాయుడు సనిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. కంప్లీట్ ఫన్ ఎంటరటైనర్ గా రాబోతోన్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా తెలుగులో సందీప్ పని ఐపోయింది అనుకుంటోన్న టైమ్ లో సడెన్ గా రెండు సినిమాలు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడీ యంగ్ హీరో. మరి ఈ రెండు సినిమాల్లో ఏది హిట్ అయినా మళ్లీ మనోడి కెరీర్ పట్టాలెక్కినట్టే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here