కుర్రాడిగా మారిపోయిన సల్మాన్ ఖాన్

0
187
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘భరత్’ ఈద్ సందర్భంగా జూన్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విడుదలకు రెండు నెలలే ఉండడంతో ఫిలిం మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. నిన్న ‘భరత్’ చిత్రం నుండి సల్మాన్ ఖాన్ వయసు మళ్ళిన గెటప్ లో ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఎప్పుడు టీనేజ్ కుర్రాడిలా డ్రెస్సులు వేసుకునే సల్మాన్ ఆ గెటప్ లో సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్.. గెడ్డంతో కనిపించి అందరిని సర్ ప్రైజ్ చేశాడు. తాజాగా ఈ సినిమా నుండి మరో పోస్టర్ రిలీజ్ అయింది.
సల్మాన్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా “కుర్రతనం నాకు ప్రియనేస్తంగా ఉండేది. యువకుడిగా భరత్” అంటూ ట్వీట్ చేస్తూ కొత్త పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నాడు. సర్కస్ లో బైక్ స్టంట్స్ చేసే వ్యక్తి పాత్రలో కనిపించాడు. ఎంబ్రాయిడరీ ఉన్న వైట్ కోటు ధరించి కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ‘మైనే ప్యార్ కియా’ లుక్ ను గుర్తు తెస్తున్నాడు. పోస్టర్ లో 1964 అని ఉంది కాబట్టి సినిమాలో అప్పటి ఎపిసోడ్ ఉన్నట్టే లెక్క. పోస్టర్ లోనే నేపథ్యంలో సర్కస్ బ్యూటీగా దిశా పతాని గ్లామరస్ దుస్తులలో జిమ్నాస్టిక్ ఫీట్స్ చేస్తూ ఉంది.

ఈ సినిమాలో సల్మాన్ ఇదు డిఫరెంట్ గెటప్స్ ఉన్నాయట. ఈరోజు నుండి వరసగా ప్రతి రోజు ఒక్కో గెటప్ కు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ సినిమాలో కత్రినా కైఫ్.. టబు.. జాకీ ష్రాఫ్.. దిశా పతాని.. సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలీ అబ్బాస్ జఫార్ ఈ చిత్రానికి దర్శకుడు.