రుణం మూవీ రివ్యూ

0
565
Hop in for a free ride with

బెస్ట్‌విన్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై భీమినేని సురేష్‌, జి.రామకృష్ణారావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రుణం. ఎస్‌.గుండ్రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. గోపికృష్ణ, మహేంద్ర, షిల్పా, ప్రియా అగస్థ్యన్లు నటీనటులుగా నటించారు. ఈ చిత్రం ఇద్దరి స్నేహితులమధ్య జరిగే కథ. డబ్బు వారి జీవితాల్ని ఎలా మార్చిందనేది అసలు కథ. వారి జీవితాల్లో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. మానవ సంబంధాలపై రాసిన కథ. ప్రతి ఇంటిలోనూ రుణానుబంధాలు ఉంటాయి. ఈ కథ ఫ్యామిలీ ఎమోషన్స్‌ తో కూడిన మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం. సినిమా ప్రారంభంలో వచ్చే ఫైట్ బాగా కంపోజ్ చేశారు. స్క్రీన్ ప్లే బాగుంది. ఆ తర్వాత వచ్చే పబ్ సాంగ్ ట్రెండీగా ఉంది. హీరో డ్యాన్సులు ఇరగదీశాడు. ఈ పాటకు కొరియోగ్రఫీ బాగుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్ మధ్య వచ్చే ట్విస్ట్ బాగుంది. శ్రీను గర్ల్ ఫ్రెండ్ సరళ ఎంట్రీ సాంగ్ బాగుంది. సరళ ఎంట్రీని డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. రోడ్ దాటించే సీన్ కొత్తగా ఉంది. వీరిద్దరి మధ్య మెలోడీ సాంగ్ బాగుంది. లొకేషన్స్ బాగున్నాయి. ఆ తర్వాత స్క్రీన్ ప్లే పరంగా చిన్న ట్విస్ట్ బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరింది. ఈ చిత్రానికి డైలాగులు బాగా కుదిరాయి. డైరెక్టర్‌ ప్రతి పాత్రని చాలా చక్కగా చిత్రీకరించారు.

సుధీర్ (హీరో), లతను(హీరోయిన్) బాగా ఇష్టపడతాడు. ఆమె కూడా ప్రేమిస్తుంది. సుధీర్, లతను పెళ్లి చేసుకుందామనుకుంటాడు. కానీ తనను వాడుకొని వదిలేసిందని లేటుగా తెలుసుకుంటాడు. సుధీర్ బెస్ట్ ఫ్రెండ్ శ్రీను(మరో హీరో) . సుధీర్, శ్రీను కలిసి ఒకే రూమ్ లో ఉంటారు. శ్రీను ఆర్థిక పరిస్థితి బాగుండదు. సుధీర్ కూడా చాలీ చాలని జీతంతో బతుకుతుంటాడు. శ్రీను, సరళ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామనుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జీవితంపై విరక్తి కలుగుతుంది. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో సుధీర్ శ్రీనుకు ఓ ప్లాన్ చెబుతాడు. శ్రీను వ్యతిరేకిస్తాడు. కానీ సుధీర్ ఒప్పిస్తాడు. వారి చేసిన పనికి వెట్రీ వీరిని వెతికి పట్టుకుంటాడు. ఆ తర్వాత సుధీర్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇంతకూ సుధీర్, శ్రీను చేసిన పనేంటి. వెట్రి వారిని ఏం చేశాడు అన్నదే కదా….

ఈ సినిమాకు మ్యూజిక్‌ హైలెట్‌గా నిలిచింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. డిఓపి కష్టం కనిపించింది. విజువల్ బ్యూటీ కనిపించింది. ప్రొడ్యూసర్‌ జి. రామకృష్ణారావు నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. డైరెక్టర్‌ ఎస్‌.గుండ్రెడ్డి మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. హీరోగా చేసిన గోపికృష్ణ కథను తన భుజాల మీదేసుకొని కథను నడిపించాడు. హీరో మహేంద్ర ప్రామినెంట్ రోల్ ప్లే చేశాడు. ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించాడు. హీరోయిన్‌ ప్రియా అందం అభినయంతో ఆకట్టుకుంది. విలన్‌ ప్రదీప్‌ పత్తికొండ విలనిజం బాగుంది. విలన్ బిల్డప్ షాట్స్ బాగున్నాయి.ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ. ఫ్యామిలీ ఎమోషన్స్ ని బాగా ఇష్టపడేవారికి రుణం బాగా నచ్చుతుంది.

ప్లస్ పాయింట్స్:
మ్యూజిక్‌
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
విలన్‌
ఎమోష‌న‌ల్ సీన్స్

మైనస్ పాయింట్స్:
స్లో నెరేష‌న్,
పంచ్ డైలాగ్స్

ఫిలిం జల్సా రేటింగ్ : 3/5