లేడీ ఎమ్మెల్యేతో రౌడీ రొమాన్స్

0
1688

విజయ్ దేవరకొండ.. షార్ట్ పీరియడ్ లో లార్జ్ ఇమేజ్ తెచ్చుకున్న స్టార్. వరుస సినిమాలతో ఎవరికీ అందకుండా దూసుకుపోతోన్న విజయ్ కోసం ఇప్పుడు నిర్మాతలు, దర్శకులు ఒకరకమైన క్యూ కట్టి ఉన్నారనేది నిజం. అయితే అతను ఇంత స్టార్డమ్ వస్తుందని ఊహించక ముందు.. కొన్ని ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నాడు. అందుకే ముందు వాటిని క్లియర్ చేసే పనిలో ఉన్నాడు. అవి క్లియర్ అయితే ఇక కొత్త ప్రాజెక్ట్స్ కు తను అడిగినంత.. లేదా వాళ్లు పెంచినంత రెమ్యూనరేషన్ తీసుకోవచ్చు. అందుకే ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలను వేగంగా పూర్తి చేస్తున్నాడు. అన్నట్టు ఇవి పూర్తి కాగానే తర్వాత ఏడాదికి ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తాడట. ఇక ప్రస్తుతం డియర్ కామ్రేడ్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్. దీని తర్వాత మరో కొత్త దర్శకుడితో పాటు క్రాంతిమాధవ్ దర్శకత్వంలోనూ సినిమా ఉంటుంది.

కెఎస్ రామారావు నిర్మిస్తోన్న క్రాంతిమాధవ్ చిత్రంలో నలుగురు హీరోయిన్లు నటిస్తారని గతంలోనే చెప్పారు. వీరిలో ముగ్గురు ముద్దుగుమ్మలను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు. రాశిఖన్నా, తమిళ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ తో పాటు ఇసబెల్లాలు ఆ ముగ్గురు భామలు. ఇక లేటెస్ట్ గా నాలుగో బ్యూటీని కూడా ఫైనల్ చేశారు. ఇద్దరమ్మాయిలతో ఆకట్టుకున్న కేథరీన్ థ్రెస్సా. సరైనోడు సినిమాలో రౌడీ ఎమ్మెల్యేగానూ ఆకట్టుకున్న కేథరీన్ ఓ బ్రేక్ కోసం తెగ ఇదవుతోంది. ఇక ఇప్పుడు ఏకంగా రౌడీ సినిమాలోనే ఆఫర్ వచ్చింది కాబట్టి వెంటనే ఓకే చెప్పిందట. ఇక ఈ సినిమా వీలైనంత త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here