Tholi Parichayam Review


వెంకీ, లాస్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఎల్. రాధాకృష్ణ ప్రొడ‌క్ష‌న్స్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన చిత్రం తొలి ప‌రిచ‌యం. సినిమా పేరుతోనే క్యూరియాసిటీ పెంచేసిన ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ నుంచే అబ్బాయికి అమ్మాయి తాళి క‌ట్టే పోస్ట‌ర్ ను రిలీజ్ చేసి స‌క్సెస్ అయిన ఈ టీమ్ ట్రైల‌ర్ తో ఇంకొంచెం కొత్త‌గా ట్రై చేసి ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి రేకెత్తించింది. మ‌రి సినిమా పేరు నుంచే ప్రేక్ష‌కుల్లో అంచ‌నాల‌ను పెంచిన తొలి పరిచ‌యం అంచ‌నాల‌ను అందుకుందా లేదా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.


క‌థః 

పెళ్లికి పూర్తి వ్యతిరేకులైన వెంకీ, లాస్య లు ఆ మాటెత్తితేనే ఫైర్ అయిపోతుంటారు. పెళ్లి అయితే త‌మ స్వ‌తంత్యాన్ని కోల్పోతార‌ని, త‌మ‌కు న‌చ్చిన‌ట్లు ఉండేల‌ర‌న్న భావ‌నతో ఉంటారు. అస‌లు వాళ్లు అలా అనుకోవ‌డానికి కార‌ణ‌మేంటి?  మ‌రి అలాంటివారు ఎలా ప్రేమ‌లో ప‌డ‌తారు? ఎలా ఒక్క‌ట‌వుతార‌న్న‌దే అస‌లు క‌థ‌.


న‌టీనటుల ప్ర‌తిభః 

హీరో, హీరోయిన్ ల ఇద్ద‌రికీ ఇది మొద‌టి సినిమానే అయిన‌ప్ప‌టికీ చాలా నేచుర‌ల్ గా న‌టించారు. వారిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా కుదిరింది. వారిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు బాగా పండాయి. న‌టీన‌టులంద‌రి దగ్గ‌ర నుంచి ద‌ర్శ‌కుడు మంచి న‌ట‌న‌ను రాబ‌ట్టుకున్నాడు. రాజీవ్ క‌న‌కాల తెర మీద క‌నిపించిన‌ప్పుడ‌ల్లా క‌థ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముర‌ళీ మోహ‌న్ పాత్ర సినిమాకు బాగా కీల‌కం.  మిగిలిన పాత్ర‌ధారులు ఎవ‌రి పాత్ర మేర వారు బాగా చేశారు.


సాంకేతిక నిపుణులుః 

ద‌ర్శ‌కుడు రాసుకున్న స్వ‌చ్ఛ‌మైన ప‌ల్లెటూరి క‌థ చాలా బావుంది. ప‌ల్లెటూరి ప‌ద్ధతుల్ని, ప‌రిస్థితుల్ని  బాగా చూపించాడు. చాలా మందికి త‌మ ప‌ల్లెల్ని త‌ల‌పించేలా క‌థను బాగా తీర్చిదిద్దుకున్నాడు. పాత్ర‌లు నాలుగైదే ఉన్నా,  ఎవ‌రి పాత్ర‌ల‌ను వారికి చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు. పాట‌లు, రీరికార్డింగ్ సినిమాకు త‌గ్గ‌ట్టుగా బావున్నాయి. సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ప‌ల్లెటూరి అందాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు బాగా చూపించారు. ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.  


ప్ల‌స్ పాయింట్స్ః 

న‌టీన‌టులు

ద‌ర్శ‌క‌త్వం

సంగీతం


మైన‌స్ పాయింట్స్ః 

అన‌వ‌స‌రమైన స‌న్నివేశాలు


పంచ్‌లైన్ః పెళ్లికి పంచ్ వేసిన తొలిపరిచ‌యం

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5


Follow Us