Raju Gari Gadhi2 Movie Review


చిన్న సినిమాగా వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన రాజు గారి గ‌ది కి సీక్వెల్ గా ఎన్నో రోజులుగా అంద‌రూ ఎదురుచూస్తున్న సినిమా రాజు గారి గ‌ది2. నాగార్జున‌, స‌మంత లాంటి స్టార్స్ ఈ సినిమాలో న‌టించ‌డం, పీవీపీ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించ‌డంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మ‌రి ఆ అంచ‌నాలు రాజు గారి గ‌ది2 అందుకుందా లేదా చూద్దాం.

క‌థః 

ముగ్గురు స్నేహితులు ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి, ఓ రిసార్ట్ స్టార్ట్ చేసి బిజినెస్ చేస్తారు. అక్క‌డ వారికి గెస్ట్  గా సీర‌త్ క‌పూర్ వ‌స్తుంది. ముగ్గురి ఫ్రెండ్స్ లో ఇద్ద‌రు ఆమెకు అట్రాక్ట్ అయి డేటింగ్ ప్లాన్ చేస్తారు. కానీ ఆమె దెయ్యం అని భ‌య‌ప‌డి మూడ‌వ ఫ్రెండ్ కు చెప్తారు. కానీ అత‌డు న‌మ్మ‌డు. చివ‌ర‌కు అత‌నికి కూడా దెయ్యం ఉంద‌ని అర్థ‌మ‌వుతుంది. అస‌లు ఆ దెయ్యం వీరిని ఎందుకు వెంటాడింది?  ఆ దెయ్యం బారినుంచి నాగార్జున ఆ ముగ్గురిని ఎలా త‌ప్పించాడు ? ఈ సినిమాలో స‌మంత పాత్రేంటి అన్నదే మిగ‌తా క‌థ‌.


న‌టీన‌టుల ప్ర‌తిభః 

త‌న‌కు ఒక క‌థ విన్న త‌ర్వాత నిద్ర కూడా ప‌ట్టలేద‌ని చెప్పిన నాగార్జున, ఈ సినిమాలో మెంట‌లిస్ట్ గా బాగా చేశాడు. ఎదుటి వారి మ‌న‌సులో అనుకున్న‌ది, వారి మైండ్ లో అనుకున్న‌ది సైతం క‌నిపెట్ట‌గ‌లిగిన రుద్ర క్యారెక్ట‌ర్ లో మెప్పించ‌గ‌లిగాడు కానీ ఈ క‌థ‌లో త‌న‌ను నిద్ర ప‌ట్ట‌నివ్వ‌కుండా చేసేంత‌టి మ్యాట‌ర్ ఏంట‌న్న‌దే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇక సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స‌మంత గురించే. ఈ సినిమాకు స‌మంతే పెద్ద ఎస్సెట్. అమృత పాత్ర‌లో జీవించేసింది. న‌టిగా స‌మంత రాజు గారి గ‌ది2 తో మ‌రో మెట్టు ఎక్కింద‌నే చెప్పాలి. క‌ళ్ల‌తోనే న‌టించేసింది స‌మంత‌. సీరత్ క‌పూర్ త‌న అందాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. వెన్నెల కిషోర్ ఎప్ప‌టిలాగానే బాగా న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. ప్ర‌వీణ్, అశ్విన్ పాత్ర‌లు తేలిపోయాయి. స‌మంత‌కు తండ్రిగా రావు ర‌మేష్ చాలా బాగా చేశాడు. చిన్న పాత్ర అయినా గుర్తిండిపోయేలా చేయ‌డంలో ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా. మిగ‌తా వారిలో న‌రేష్, నందు ఎవ‌రి పరిధి మేర వారు బాగానే చేశారు. 


సాంకేతిక నిపుణులుః 

కేవ‌లం మూడు సినిమాల‌కే నాగార్జున‌, స‌మంత లాంటి స్టార్స్ ను డైర‌క్ట్ చేసే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు ఆ అవ‌కాశాన్ని చాలా జాగ్ర‌త్త‌గా వినియోగించుకోవాలి ఏ డైర‌క్ట‌ర్ అయినా. కానీ ఓంకార్ ఈ విష‌యంలో ఇంకాస్త శ్ర‌ద్ధ పెట్టుండాల్సింది. ప్రేత‌మ్ అనే సినిమా ఆధారంగా ఈ సినిమాను తెర‌క్కించాడు త‌ప్పించి, పెద్ద‌గా కొత్త అంశాలేవీ లేకుండా సినిమాను లాక్కొచ్చేశాడు. మంచి స్టోరీ లైన్ ను అనుకున్న ఓంకార్, దాన్ని  ప్రేక్ష‌కుల‌కు ప్రెజెంట్ చేయ‌డంలో మాత్రం కాస్త త‌డ‌బ‌డ్డాడు. సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ప్ర‌తీ సీన్ విజువ‌ల్ గా గ్రాండ్ గా ఉంది. థమ‌న్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మేజ‌ర్ ప్ల‌స్ పాయింట్. రుద్ర‌, అమృత పాత్ర‌ల‌కు త‌ను ఇచ్చిన రీరికార్డింగ్ చాలా బావుంది. ఎడిటింగ్ బావుంది.  నిర్మాణ విలువ‌లు బావున్నాయి. 


ప్ల‌స్ పాయింట్స్ః 

నాగ‌ర్జున‌, స‌మంత‌ న‌ట‌న‌

థ‌మ‌న్ నేప‌థ్య సంగీతం


మైన‌స్ పాయింట్స్ః 

క‌థ‌ను స‌రిగా చెప్ప‌లేక‌పోవ‌డం

న‌వ్వించ‌లేక‌పోవ‌డం


పంచ్‌లైన్ః రెండో గ‌ది కంటే మొద‌టి గది బావుంది

ఫిల్మ్ జ‌ల్సా రేటింగ్ః 3/5


Follow Us