Mca Review


వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న నాని, స‌క్సెస్‌ఫుల్ చిత్రాల దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ లో మిడిల్ క్లాస్ అబ్బాయి గా ప‌లుక‌రించాడు. టైటిల్ తోనే జ‌నాల‌ను ఆక‌ట్టుకున్న నాని.. ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్, ట్రైల‌ర్ ఇలా ప్ర‌తీదాంతోనూ ప్రేక్ష‌కుల్లో సినిమాపై అంచ‌నాల‌ను పెంచాడు. దానికితోడు ఫిదాతో యూత్ ను క‌ట్టిప‌డేసిన సాయి ప‌ల్ల‌వి నాని ప‌క్క‌న న‌టించ‌నుండ‌టంతో సినిమాపై మంచి అంచనాలేర్ప‌డ్డాయి. మ‌రి ఇన్ని అంచ‌నాల‌ను మిడిల్ క్లాస్ అబ్బాయి అందుకున్నాడా లేదా అన్న‌ది మ‌న స‌మీక్ష‌లో చూద్దాం.


క‌థః 

నాని, రాజీవ్ క‌న‌కాల అన్న‌ద‌మ్ములు. చిన్న‌ప్ప‌టి నుంచి ఒక‌రికొక‌రు ప్రాణంగా బ్ర‌తుకుతారు. అలాంటిది అన్న‌కు పెళ్లైన త‌ర్వాత వ‌దిన భూమిక వ‌స్తుంది. ఇన్ని రోజులు త‌నతో ఉన్న అన్న‌య్య త‌న‌కు దూర‌మ‌వ్వ‌డానికి కార‌ణం వ‌దినే అని త‌న‌మీద అయిష్టంగా ఉంటాడు నాని. అదే టైమ్ లో సాయి ప‌ల్ల‌వి తో ప్రేమ‌లో ప‌డ‌తాడు నాని. ప్ర‌భుత్వ ఉద్యోగి అయిన భూమిక కు త‌న ఉద్యోగ‌రీత్యా వ‌రంగ‌ల్ లో లోక‌ల్ రౌడీతో గొడవై, భూమిక  ను చంపాల‌ని ప్ర‌య‌త్నిస్తాడు రౌడీ. అలాంటి స‌మ‌యంలో నాని రౌడీ కి అడ్డుప‌డ‌తాడు. అస‌లు వ‌దిన‌పై ఇష్టం లేని నాని వ‌దిన‌ను ఎందుకు కాపాడుకోవాల‌నుకుంటాడు..?  లోకల్ రౌడీ నుంచి వ‌దిన‌ను నాని ఎలా కాపాడుకున్నాడు.?  చివ‌ర‌కు త‌న ప్రేమ‌ను ఎలా పెళ్లిపీటలెక్కించాడ‌న్న‌ది మిగ‌తా క‌థ‌.


న‌టీన‌టుల ప్ర‌తిభః  

మిడిల్ క్లాస్ అబ్బాయిగా నాని ఎంత చేయాలో అంతా చేశాడు. అటు ల‌వ్ సీన్స్ లోనూ, యాక్ష‌న్స్ సీన్స్ లోనూ, కామెడీ టైమింగ్ తోనూ బాగా ఆక‌ట్టుకున్నాడు. కానీ స్క్రిప్ట్ కాస్త ప‌క్క‌దారి ప‌ట్టేస‌రికి నాని సైతం సెకండాఫ్ లో ఏమీ చేయ‌లేక‌పోయాడు. సాయి ప‌ల్ల‌వి త‌న ఎక్స్‌ప్రెష‌న్స్ తో, డ్యాన్స్ ల‌తో మ‌రోసారి యువ‌త‌ను అట్రాక్ట్ చేస్తుంది. కానీ సాయి ప‌ల్ల‌వి క్యారెక్ట‌రైజేష‌న్ మొద‌ట్లో ఉన్నంత ఆస‌క్తిగా త‌ర్వాత ఉండ‌దు. నాని, సాయి ప‌ల్ల‌వి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు, నాని, భూమిక ల మ‌ధ్య వ‌చ్చే సీన్స్ అన్నీ చాలా బావున్నాయి. భాధ్యతగల వదినగా భూమిక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్  చేసి ఆక‌ట్టుకుంది. నానికి అన్న‌య్య పాత్ర‌లో రాజీవ్ క‌న‌కాల మెప్పించాడు. మిగ‌తా పాత్ర‌ల్లో పోసాని, న‌రేష్, వెన్నెల కిషోర్, ప్రియ‌ద‌ర్శి, ర‌చ్చ ర‌వి త‌మ త‌మ పరిధిలో బాగానే చేశారు. 


సాంకేతిక నిపుణులుః 

క‌థ దృష్ట్యా మామూలు క‌థ‌నే ఎంచుకున్న ద‌ర్శ‌కుడు శ్రీరామ్ వేణు, స్క్రీన్ ప్లే దృష్ట్యా అయినా కాస్త క‌స‌ర‌త్తు చేసుండాల్సింది. హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ను ద‌ర్శ‌కుడు తీర్చిదిద్దిన విధానం బావున్న‌ప్ప‌టికీ, క‌థ‌లోకి ఎంట‌ర్ అయ్యాక అది ఎటెటో తిరిగి చివ‌రికి పక్క‌దారి ప‌ట్టింది. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతంలో రెండు పాట‌లు ఆకట్టుకుంటాయి. పాట‌లను పిక్చ‌రైజ్ చేసిన విధానం బావుంది. రీరికార్డింగ్ కూడా ఏమీ చెప్పుకునేంత స్థాయిలో లేదు. వ‌రంగ‌ల్ అందాల‌ను స‌మీర్ రెడ్డి త‌న కెమెరా క‌న్నుతో చాలా బాగా చూపించాడు. ఎడిటింగ్ ఫ‌ర్వాలేదు. దిల్ రాజు నిర్మాణ విలువ‌లు ఎప్ప‌టిలాగానే బావున్నాయి. 


ప్ల‌స్ పాయింట్స్ః 

నాని- సాయి ప‌ల్ల‌వి కెమిస్ట్రీ

ఫ‌స్టాఫ్


మైన‌స్ పాయింట్స్ః 

సెకండాఫ్‌

రొటీన్ స్టోరీ


పంచ్‌లైన్ః మిడిల్ క్లాస్ అబ్బాయి ఓకే అనిపించాడు

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.25/5

 

 


Follow Us