Lovers Club Review


కొన్ని సినిమాలు మామూలుగా మంచి కెమెరాల‌తో తీస్తేనే సినిమాటోగ్ర‌ఫీ అంతంత‌మాత్రంగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఐఫోన్ తో సినిమా తీసి దాన్ని రిలీజ్ వ‌ర‌కు తీసుకురావ‌డం, దానికితోడు ఆల్రెడీ పేరున్న డైర‌క్ట‌ర్ ఆ సినిమాను నిర్మించడం ఇలాంటివన్నీ ల‌వ‌ర్స్ క్ల‌బ్ సినిమాకు మంచి హైప్ ను తెచ్చిపెట్టాయి. మ‌రి ఇంత హైప్ తో వ‌చ్చిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా లేదా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.


క‌థః 

అనిష్ చంద్ర ప్రేమ జంటల్ని క‌లుపుతూ, వారికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా తీరుస్తూ ల‌వ‌ర్స్ క్ల‌బ్ ఒక‌టి పెట్టి బాగా పాపుల‌ర్ అవుతాడు. దీంతో చాలా కుటుంబాలు రిషిని టార్గెట్ చేస్తాయి. ఈ స‌మ‌యంలో పావని త‌నకు ఆల్రెడీ పెళ్లైంద‌ని చెప్పి అనిష్ ఇంట్లో దిగుతుంది. అనిష్ పావ‌ని ని ఇష్ట‌ప‌డ‌టం, పావ‌ని కూడా అనిష్ ను ఇష్ట‌ప‌డటం జ‌రుగుతాయి. అస‌లు అనీష్ ల‌వ‌ర్స్ క్ల‌బ్‌ను ఏ కారణంతో పెట్టాడు? ఎలాంటి స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొన్నాడు. పెళ్లైంది అని చెప్పుకున్న గీత రిషి వెంట ఎందుకు ప‌డింది?  అన్న‌ది తెర‌మీదే చూడాలి.  


న‌టీన‌టుల ప్ర‌తిభః 

అనీష్ చంద్ర కు మంచి క్యారెక్టర్ దొరికింది. ల‌వ‌ర్స్ క్ల‌బ్ లాంటి యూనియ‌న్ ను న‌డిపించేట‌ప్పుడు ఎలాంటి ప‌రిస్థితులుంటాయో వాట‌న్నింటినీ అర్థం చేసుకుని చాలా బాగా మెచ్యూర్డ్ గా న‌టించాడు. రొమాంటిక్ సీన్స్ లోనూ, మాస్ లుక్స్ ప‌రంగానూ అన్ని స‌న్నివేశాల్లో మెప్పించాడు.  హీరోయిన్ పావ‌ని ఇంత‌కుముందు చాలా పాత్ర‌లు చేసిన‌ప్ప‌టికీ ఈ పాత్ర కొత్త‌గా ఉంది. ఇంట‌ర్వెల్ కు ముందు వ‌చ్చే ట్విస్ట్ బావుంది. సెకండాఫ్ లో ఆర్య‌న్, పూర్ణిలుచాలా బాగా చేశారు. ఆర్య‌న్ న‌ట‌న చాలా స‌హ‌జంగా ఉంది. పూర్ణి అటు అందంతో పాటూ, ఇటు అభినయంతోనూ ఆక‌ట్టుకుంది. ధీర‌జ్ విల‌న్ గా అంద‌రినీ భ‌య‌పెడ‌తాడు. మిగిలిన వారిలో చిత్రం భాష, వైజాగ్ ప్ర‌సాద్, ఇందు త‌మ త‌మ పాత్ర‌ల మేర బాగా న‌టించారు.  


సాంకేతిక నిపుణులుః 

ద‌ర్శ‌కుడు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని టార్గెట్ చేశాడు. కంటెంట్ యూత్ కే అయిన‌ప్ప‌టికీ ఈ సినిమావ‌ల్ల పెద్దోళ్లు నేర్చుకునే విష‌యాలు చాలానే ఉన్నాయి. సినిమాలో ఎమోష‌న‌ల్ సీన్స్ కు ఫ్యామిల ఆడియెన్స్ బాగా క‌నెక్ట్ అవుతారు. హీరో హీరోయిన్ మ‌ధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ బావున్నాయి. డైలాగులు బాగా రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. దీంతో ప్రేక్ష‌కుడికి ఎక్క‌డా సినిమా చూసిన‌ట్ల‌నిపించ‌కుండా, స‌హ‌జంగా ఉంటుంది.  సినిమాలో మెచ్చుకోద‌గ్గ వ్య‌క్తి అంటే సినిమాటోగ్ర‌ఫ‌ర్ ను. ఐ ఫోన్ లో కూడా ఇంత  బాగా సినిమా తీయొచ్చ‌ని నిరూపించాడు. సంగీతం బావుంది. రీరికార్డింగ్ సినిమా స్థాయికి త‌గ్గ‌ట్లుంది. ఎడిటింగ్ ఫ‌ర్వాలేదు. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.  


ప్ల‌స్ పాయింట్స్ః 

సినిమాటోగ్ర‌ఫీ

ద‌ర్శ‌క‌త్వం


మైన‌స్ పాయింట్స్ః 

అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలు


పంచ్‌లైన్ః ల‌వ‌ర్స్ క్ల‌బ్ చూడాల్సిన క్ల‌బ్

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5Follow Us