Kiss Kiss Bang Bang Review


టాలీవుడ్ లో ఈ మ‌ధ్య సినిమా టైటిల్సే ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. టీజ‌ర్లు, ట్రైల‌ర్ ల‌తోనే మంచి హైప్ తెచ్చుకున్న కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ సినిమా జ‌నాల‌ను తెర‌పై ఎలా ఆకట్ట‌కుందో,  టీజ‌ర్.. ట్రైల‌ర్ ల‌కు వ‌చ్చిన హైప్ మూవీ కి కూడా వ‌స్తుందా లేదా అన్న‌ది మ‌న సమీక్ష‌లో చూద్దాం.


క‌థః 

ఆర్యన్ మీడియా లో పని చేసే ఒక జర్నలిస్ట్. అతనికి మెట్రో లైఫ్ స్టైల్ లో బ్రతికే ఒక గర్ల్ ఫ్రెండ్ స్వీటీ . ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తూ ఉంటారు. అయితే , ఒక పబ్ కి వెళ్ళిన ఆర్యన్ తన పర్స్ పోగొట్టుకుంటాడు. పోయిన తన పర్స్ పొందే క్రమంలో ఆర్యన్ తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే అదే సమయంలో స్వేటీ లైఫ్ స్టైల్ వల్ల ఇర్రిటేట్ అయ్యి ఆర్యన్ తన దగ్గర నుండి వెళ్లిపోమంటాడు. అలా వెళ్ళమని చెప్పిన మరుసటి రోజే స్వీటీ హత్యకు గురవుతుంది. ఆ తరువాత ఏమి జరిగింది అనేదే సినిమా కథ.


న‌టీన‌టుల ప్ర‌తిభః

ఆర్య‌న్ పాత్ర‌లో చేసిన కిర‌ణ్ చాలా స‌హ‌జంగా న‌టించాడు. పాత్ర‌లో బాగా ఒదిగిపోయాడు. ద‌ర్శ‌కుడు కిర‌ణ్ నుంచి చాలా మంచి న‌ట‌నను రాబట్టుకున్నాడు. కానీ డ‌బ్బింగ్ విష‌యంలో ఇంకాస్త శ్ర‌ద్ధ తీసుకుని ఉండాల్సింది. స్వీటీ పాత్ర‌లో చేసి హ‌ర్షితా కుల‌క‌ర్ణి చాలా హాట్ గా క‌నిపించింది. రొమాంటిక్ సీన్స్ లో ఇంకాస్త రెచ్చిపోయి న‌టించింది. ఇక సినిమాలో చెప్పుకోద‌గ్గ పాత్ర అంటే ఫిదా ఫేం గాయత్రి గుప్తా. మ‌రోసారి ఒక మంచి రోల్ చేసింది. చేసింది ప్రాస్టిట్యూట్ క్యార‌క్ట‌ర్ అయినా ఎక్క‌డా వ‌ల్గారిటీ లేకుండా బావుంది. కాక‌పోతే డైలాగ్స్ మాత్రం కాస్త బోల్డ్ గా ఉంటాయి. సినిమాలో ప్ర‌తీ ట్విస్ట్ కు గాయ‌త్రి పాత్ర‌కు సంబంధం ఉంటుంది. డైర‌క్ట‌ర్ గాయ‌త్రి పాత్ర‌ను తీర్చిదిద్దిన విధానం చాలా బావుంది. విల‌న్ కూడా బాగా చేశాడు.  మిగిలిన వారిలో ఎవ‌రి పాత్ర‌లో వారు బాగా చేశారు. 


సాంకేతిక నిపుణులుః 

కేవ‌లం 40 ల‌క్ష‌ల్లో ఇలాంటి మంచి డెప్త్ ఉన్న క‌థ‌ను చాలా రిచ్ గా తెర‌కెక్కించిన డైర‌క్ట‌ర్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి. క‌థ‌లో ఇంట్రెస్టింగ్ సీన్స్, సెకండాఫ్ లో వ‌చ్చే ట్విస్టులు బావున్నాయి. కానీ ఫ‌స్టాఫ్ విష‌యంలో ద‌ర్శ‌కుడు ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే సినిమా స్థాయి మ‌రింత పెరిగేది. సినిమాటోగ్ర‌ఫీ బావుంది. మ్యూజిక్ కాస్త స్లో గా ఉంది. ప్ర‌వీణ్ చాగంటి పాడిన టైటిల్ సాంగ్ కాస్త బావుంది. ఎడిటింగ్ చాలా క్రిస్పీగా, లెంగ్త్ ను చాలా బాగా మేనేజ్ చేశారు. త‌క్కువ బ‌డ్జెట్ తో ఇలా సినిమా తీసినందుకు నిర్మాత‌ల‌ను మెచ్చుకోవాల్సిందే. 


ప్ల‌స్ పాయింట్స్ః 

ద‌ర్శ‌కుడు అనుకున్న స్టోరీ లైన్

గాయ‌త్రి గుప్తా

ఎడిటింగ్


మైన‌స్ పాయింట్స్ః 

ఫస్టాఫ్ 

స్లో నెరేష‌న్


పంచ్‌లైన్ః కొత్త క‌థే కానీ కేర్ తీసుకోవాల్సింది

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5Follow Us