Inttelligent Review


మెగా మేన‌ల్లుడిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన సాయి ధ‌ర‌మ్ తేజ్ కొద్ది రోజుల్లోనే సుప్రీమ్ హీరోగా ఎదిగి, త‌న‌కంటూ గుర్తింపు సంపాదించిన‌ప్ప‌టికీ, గత నాలుగు సినిమాలుగా అప‌జ‌యాలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. స‌రైన విజ‌యం అంద‌క స‌త‌మ‌త‌మ‌వుతున్న టైమ్ లో మాస్ డైర‌క్ట‌ర్ వి.వి. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఇంటిలిజెంట్ అంటూ తెలివైన ప్ర‌య‌త్నం చేశాడు తేజూ. మ‌రి వినాయ‌క్ అయినా సాయి ధ‌ర‌మ్ తేజ్ కు విజ‌యం అందించాడా లేదా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.


క‌థః 

నందకిషోర్‌ (నాజర్‌) ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థకు యజమాని. తనకు వచ్చిన లాభాలతో ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటాడు. ఎంతో మంది పేద పిల్లలను, అనాథలను చేర దీసి ఆదరిస్తూ ఉంటాడు. ప్రతిభ ఉన్న చిన్నారులను చదివిస్తుంటాడు. అలా తేజ (సాయిధరమ్‌ తేజ్‌)ను చదివిస్తాడు. ఆ కృతజ్ఞతతో నాజర్‌ వద్దే పనిచేస్తూ ఉంటాడు. తన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ వల్ల మిగతా ఏ కంపెనీలు మనుగడను సాధించలేకపోతాయి. అలా ఓ కంపెనీ యజమానులు మాఫియా డాన్‌ విక్కీ‍భాయ్‌ (రాహుల్‌ దేవ్‌)ను ఆశ్రయిస్తారు. విక్కీభాయ్‌ తమ్ముడు దేవ్‌గిల్‌ రంగంలోకి దిగి నాజర్‌ను బెదిరిస్తాడు. కానీ నాజర్‌ వాటికి తలొంచడు. ఇదంతా తేజ రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తాడు. ఆ మరునాడే నాజర్‌ ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ తేజ ఇదంతా నమ్మడు. దేవ్‌గిల్‌ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తేజ ఏం చేస్తాడు? అసలు నాజర్‌ది ఆత్మహత్యనా? హత్యనా? అసలు ఏం జరిగింది? తేజ ధర్మభాయ్‌గా ఎందుకు మారాడు? ధర్మభాయ్‌ ఏం చేశాడన్నదే మిగతా కథ.


న‌టీన‌టుల ప్ర‌తిభః 

ఏ నటుడి గురించైనా చెప్పాలంటే సినిమాలో త‌న క్యారెక్ట‌రైజేష‌న్ గొప్ప‌గా ఉండాలి. అలాంట‌ప్పుడే త‌నలోని న‌టుడిని బ‌య‌ట‌కు తీయ‌గ‌ల‌డు. అంతేకానీ క‌థేమీ లేకుండా ఒక గొప్ప న‌టుడుని తెచ్చి పెట్టినా ఉప‌యోగమేమీ ఉండ‌దు. ఇక్కడ సాయి ధ‌ర‌మ్ తేజ్ ప‌రిస్థితి కూడా అంతే. క‌థ‌లో ఉన్నంత‌లో త‌న న‌ట‌న‌తో మెప్పించ‌గ‌లిగాడు త‌ప్పించి, దాని కంటే ఎక్కువ‌గా చేద్దామ‌ని తేజూ ప్ర‌య‌త్నిండానికి కూడా వీలు లేని ప‌రిస్థితి. హీరోయిన్ లావ‌ణ్య కేవ‌లం పాట‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యింది. బ్రహ్మానందం కనిపించే రెండు మూడు సీన్లలో నవ్వులు పండించాడు. నాజర్‌ తన పాత్రకు న్యాయం చేశాడు. ఆశిష్‌ విద్యార్థి, షియాజీ షిండే తమకు అలవాటైన పోలీస్‌ పాత్రలో మెప్పించారు. సప్తగిరి, పృథ్వీ, బ్రహ్మానందం, రఘుబాబు, పోసాని కృష్ణమురళీ కామెడీని బాగానే పండించారు.


సాంకేతిక నిపుణులుః 

భారీ యాక్షన్‌ సీన్స్‌ , కామెడీతో తనదైన శైలిలోనే వినాయక్‌ ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. కథలో కొత్తదనం లేదు. సెకండాఫ్‌లో హీరో త‌న చేసే ప‌నిలో భాగంగా క్రియేట్ చేసే ధ‌ర్మాభాయ్‌.. పాత్ర, దాని తీరు తెన్నులు నాయ‌క్ సినిమాకు ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ప్ప‌టికీ ఆ రేంజ్‌లో క‌న‌ప‌డ‌వు.ఆకుల శివ అందించిన మాటలు కూడా ప్రేక్షకులు గుర్తుంచుకునే స్థాయిలో లేవు. సాంగ్స్‌ లొకేషన్స్‌ బాగున్నాయి. చమక్‌ చమక్‌.. సాంగ్‌ తీసిన విధానం ఆకట్టుకుంది. వినడానికే కాదు చూడడానికి కూడా బాగుంది. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. బ్ర‌హ్మానందం కామెడీ ట్రాక్ బోర్ కొట్టిస్తుంది. ఆకుల శివ అందించిన క‌థ‌లో కొత్త‌ద‌నమేంటో.. ఇందులో వినాయ‌క్‌కు న‌చ్చిందేమో తెలియ‌లేదు. స‌రే రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ క‌దా! త‌న‌దైన కామెడీతో సినిమాను న‌డిపించేద్దామ‌నుకున్నాడో ఏమో కానీ స‌దరు కామెడీ ట్రాక్‌ల‌న్నీ వ‌ర్కువ‌ట్ కాలేదు. ఇక త‌మ‌న్ ట్యూన్స్ వినసొంపుగా లేవు. నేప‌థ్య సంగీతం ప‌రావాలేదు. విశ్వేశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. ప్రతి సీన్ ఎంతో రిచ్‌గా ఉంది. ఎడిటింగ్ మీద దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువ‌లు సినిమాకు త‌గ్గ‌ట్లు బావున్నాయి.


ప్ల‌స్ పాయింట్స్ః 

సాయి ధ‌ర‌మ్ తేజ్

డ్యాన్సులు


మైన‌స్ పాయింట్స్ః 

క‌థ‌

వి.వి. వినాయ‌క్ మార్క్ ద‌ర్శ‌క‌త్వం


పంచ్‌లైన్ః ఇంటిలిజెంట్ ను త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే..

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2/5Follow Us