Chalo Review


ప‌క్కింటి అబ్బాయిలా క‌నిపించే నాగ‌శౌర్య తాను స్టార్ హీరోగా నిరూపించుకోవ‌డానికి చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. టైమ్ క‌లిసి రాక‌పోవ‌డంతో ఎప్ప‌టిక‌ప్పుడు తాను హీరోలాగే మిగిలిపోతున్నాడు త‌ప్పించి, స్టార్ హీరో దిశ‌గా అడుగులు మాత్రం ప‌డ‌టం లేదు. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఇప్పుడు ఛ‌లో అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. సొంత బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న ఈ చిత్రంపై నాగ‌శౌర్య చాలానే అంచ‌నాలు పెట్టుకున్నాడు. మ‌రి అంచ‌నాల‌ను ఛ‌లో అందుకుందా లేదా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం..

క‌థః 
తెలుగు, త‌మిళ ప్రాంతాల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ కార‌ణంగా ఆ ప్రాంత ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులు, జ‌రిగే గొడ‌వ‌ల నేప‌థ్యంలో తెలుగు కుర్రాడైన‌ హ‌రి(నాగ‌శౌర్య‌), త‌మిళ అమ్మాయి కీర్త‌న (రష్మిక‌) లు ప్రేమ‌లో ప‌డ‌తారు. ఈ గొడ‌వ‌ల మ‌ధ్య వారి ప్రేమ‌ను ఎలా నెగ్గించుకుని, పెళ్లి ద్వారా ఒక్క‌ట‌య్యార‌న్న‌దే మిగతా క‌థ‌.

న‌టీన‌టుల ప్ర‌తిభః 
నాగ‌శౌర్య మ‌రోసారి త‌నను తాను న‌టుడిగా నిరూపించుకునే ప్ర‌య‌త్నంలో స‌క్సెస్ అయ్యాడు. అటు ఫైట్ సీన్స్, ల‌వ‌ర్ బాయ్ గా, త‌న కామెడీ టైమింగ్, డ్యాన్సులు ఇలా ప్ర‌తీదానిలోనూ గ‌త సినిమాల కంటే మెరుగ్గా క‌నిపించాడు. ఎమోష‌న‌ల్ సీన్స్ లోనూ నాగ‌శౌర్య న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ఇక ఈ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక కూడా చాలా క్యూట్ గా క‌నిపించింది. న‌ట‌న‌తో కూడా ర‌ష్మిక ఆక‌ట్టుకుంది. క‌మెడియ‌న్ స‌త్య‌కు మంచి పాత్ర ద‌క్కింది. దాదాపు హీరో క‌నిపించిన ప్ర‌తీ సీన్ లోనూ త‌న క్యారెక్ట‌ర్ ఉండ‌టం వ‌ల్ల త‌న న‌ట‌న హైలైట్ అయింది. సెకండాఫ్ లో వెన్నెల‌ కిషోర్ కామెడీ సినిమాకు ప్రాణం పోసింది. హీరో త‌ల్లిదండ్రులుగా న‌రేష్, ప్ర‌గ‌తి మంచి న‌ట‌న క‌న‌బ‌రిచారు. మిగిలిన వారిలో ప్ర‌వీణ్, రఘుబాబు, సుద‌ర్శ‌న్, వైవా హ‌ర్ష త‌మ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. 

సాంకేతిక నిపుణులుః 
మొద‌టి సినిమాతోనే ద‌ర్శ‌కుడిగా నిరూపించుకోవ‌డానికి వెంకీ కుడుముల చేసిన ప్ర‌య‌త్నాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. రెండు రాష్ట్రాల బార్డ‌ర్ లో జ‌రిగే క‌థ‌తో ఇప్ప‌టికి చాలా సినిమాలు వ‌చ్చాయి. ఛ‌లో కూడా అదే త‌ర‌హాలో ఉంటుందని భావించిన‌ప్ప‌టికీ, ఛ‌లోని పూర్తి భిన్నంగా తెర‌కెక్కించాడు. ఒక చిన్న లైన్ ను తీసుకుని దాన్ని పూర్తి ఎంట‌ర్‌టైన్‌మెంట్ త‌ర‌హాలో తెర‌కెక్కించ‌డంలో వెంకీ స‌క్సెస్ అయ్యాడు. కాక‌పోతే క్లైమాక్స్ విష‌యంలో ఇంకాస్త జాగ్ర‌త్త తీసుకుని ఉంటే ప్రేక్ష‌కులు పూర్తిగా సంతృప్తి చెందేవాళ్లు. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌రంగా లోటు లేని ఛ‌లో టెక్నిక‌ల్ గానూ రిచ్ గానే ఉంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగుంది. ప్రతీ ఫ్రేమ్ ను చాలా రిచ్ గా చూపించారు. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర సంగీతం చాలా బాగుంది. పాట‌ల‌న్నీ బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు త‌గ్గట్టు బాగా కుదిరింది. ఎడిటింగ్ బాగానే ఉంది. సెకండాఫ్ లో కొన్ని అన‌వ‌స‌ర సీన్స్ ను ట్రిమ్ చేసుంటే సినిమా స్థాయి మ‌రింత బాగుండేది. సొంత సినిమా కాబ‌ట్టి ఎక్క‌డా ఖ‌ర్చుకు లోటు లేకుండా బాగానే ఖ‌ర్చు పెట్టారు. నిర్మాణ విలువ‌లు బాగా పాటించారు.

ప్ల‌స్ పాయింట్స్ః 
నాగ‌శౌర్య, ర‌ష్మిక న‌ట‌న‌
కామెడీ
సంగీతం
సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్ః 
వీక్ సెకండాఫ్
అంతుప‌ట్ట‌ని ఫ్లాష్ బ్యాక్

పంచ్‌లైన్ః ఛ‌లో! చూసేయొచ్చు..
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.25/5


Follow Us