వినయ విధేయ రామ కు ట్రెయిన్ ఎఫెక్ట్

0
937
వినయ విధేయ రామ.. రామ్ చరణ్ చాలా అంచనాలు పెట్టుకున్న సినిమా. బోయపాటి శ్రీను తో చేస్తే కిక్ వచ్చిందని చెప్పుకున్న సినిమా. కానీ ఆ కిక్ ఆడియన్స్ కు ఎక్కలేదు సరికదా థియేటర్ కు వెళ్లిన ఆడియన్స్ విపరీతమైన బోరింగ్ తో పాటు ట్రెయిన్ సీన్ లాంటి సన్నివేశాలతో థియేటర్స్ నుంచి కిక్ చేస్తున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. కొన్నేళ్ల క్రితం పల్నాటి బ్రహ్మనాయుడులో బాలయ్య చేసిన ట్రైన్ సీన్ ను మించిన కామెడీగా ఈ సీన్ ఉండటంతో ప్రేక్షకులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారీ సినిమాను. అసలు గుజరాత్ నుంచి బిహార్ వరకూ ట్రెయిన్ పై నిలబడి ఎలా ప్రయాణం చేస్తారు అనే కంటెంట్ తో సోషల్ మీడియాలో ఈ సినిమాపై తెగ జోకులు పడుతున్నాయి. ఈ విషయంలో మొదట్లో కాస్త బుకాయించినా ఫైనల్ గా ఆ ట్రెయిన్ సీన్ ను తొలగించారట.
మామూలుగా లెంగ్త్ ఎక్కువైన సీన్స్ ను కట్ చేయడం చూశాం. లేదంటే కాంట్రవర్శీగా ఉన్న సీన్స్ తీసేయడం చూశాం. కానీ కామెడీగా ఉన్న సీన్ తీయడం ఇదే ఫస్ట్ టైమ్. ఏదేమైనా దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను ప్రేక్షకులను చాలా తక్కువగా అంచనా వేసి తెరకెక్కించాడనేది అర్థమౌతోంది. తను ఇలా తీస్తేనే చూస్తారు అనే అతని భ్రమలను కూడా వినయ విధేయుడు సమూలంగా తుడిచి వేశాడు. దీంతో అంతకు ముందు తన సినిమాలకు నెగెటివ్ టాక్ వస్తే ఓ రేంజ్ లో రివర్స్ కౌంటర్స్ వేసే బోయపాటి ఈ సినిమాకు మాత్రం నిశ్శబ్ధంగా ఉంటున్నాడు.

మరోవైపు ఇలాంటి సినిమా తీసిన దర్శకుడిని చిరంజీవి ఎలా పొగిడాడా అని ఆయనపైనా సెటైర్స్ వేస్తున్నారు. ఈ మూవీ ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి బోయపాటిని ఓ రేంజ్ లో మోసేశాడు. మామూలుగా చిరంజీవి సినిమా చూడకుండా వేదికలపై వాటి గురించి మాట్లాడడు. తను చూసి కూడా ట్రెయిన్ సీన్ ను యాక్సెప్ట్ చేయడమే కాదు.. ఇంతటి బోరింగ్ సినిమా తీసిన బోయపాటి ఎలా పొగిడాడా అని అంతా సెటైర్స్ వేస్తున్నారు. మొత్తంగా సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మూవీలో బోయపాటి చాలా హైలెట్ అవుతుందనుకున్న సీన్ కామెడీ అయిపోవడంమే కాకుండా కౌంటర్స్ కూడా కారణం అవడంతో ఏకంగా ఈ సీన్ ను పూర్తిగా తొలగించారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here