‘పులి జూదం’ మూవీ రివ్యూ

0
227

ఉన్నికృష్ణన్‌ దర్శకత్వంలో ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, తమిళ్ యాక్షన్ హీరో విశాల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పులిజూదం’. రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెర‌కెక్కిన‌ ఈ చిత్రం ఇవాళ రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో తెలుసుకుందాం.

వాలంట‌రీ రిట‌ర్మైంట్ తీసుకుని వెళ్లిపోవ‌డానికి నిర్ణ‌యించుకున్నఏడీజీపీ మాథ్యూని ముగ్గురు వ్య‌క్తుల హ‌త్య విష‌యంలో నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డానికి సాయం కోర‌తాడు. ఆ క్రైమ్ జరిగిన విధానాన్ని కనిపెట్టగలిగే మాథ్యూ మాత్రమే ఈ కేసును డీల్ చేయగలరని డీజీపీ మాథ్యూని రిక్వెస్ట్ చేయగా.. తన లీవ్ పక్కన పెట్టి మాథ్యూ ఈ కేసును హ్యాండిల్ చేస్తాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం అసలు ఆ హత్యలు చేస్తోంది ఎవరు..? దువ్వూరి మదనగోపాల్ (విశాల్)కి ఆ హత్యలకు ఉన్న సంబధం ఏమిటి ? చివరికీ మాథ్యూ ఆ హత్యలు చేస్తోన్న వారిని పట్టుకున్నాడా ? లేదా ? మదనగోపాల్ కి మాథ్యూకు మధ్య ఎలాంటి ముగింపు ఉంటుంది ? లాంటి విష‌యాల చుట్టూ తిరిగే కథే సినిమా.

అసిస్టెంట్ డీజీపీ గా మోహ‌న్ లాల్ ఎప్ప‌టిలాగే న‌ట‌న‌లో ఎంతో మెచ్యూరిటీని క‌న‌బ‌రిచాడు. ముఖ్యంగా త‌న భార్య చ‌నిపోయే సీన్ లో, విశాల్ తో వ‌చ్చే క్లైమాక్స్ సీన్ లో త‌న భావోద్వేగాల‌తో సినిమాను త‌న భుజాల‌పై వేసుకుని న‌డ‌పించాడ‌ని చెప్పొచ్చు. డాక్ట‌ర్ గా విశాల్ క‌నిపించినంత సేపు త‌న యాక్టింగ్ తో ఆక‌ట్టుకుంటాడు. హ‌న్సిక, విశాల్ కు జోడీగా మంచి అందంగా , అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. ఏసీపీ గా రాశీ ఖ‌న్నా బాగా చేసింది. విల‌న్ గా శ్రీకాంత్ కూడా త‌న నట‌న‌తో మెప్పించాడు. మిగిలిన న‌టీన‌టులు త‌మ ప‌రిధి మేర‌కు బాగానే చేశారు.

 

దర్శకుడు ఉన్నికృష్ణన్‌ సినిమాలో చెప్పాలనుకున్న ‘ప్రతి హీరోలో ఒక విలన్ ఉంటాడు, ప్రతి విలన్ లో ఒక హీరో ఉంటాడు’ అనే స్టోరీ థీమ్ బాగున్న‌ప్ప‌టికీ దాన్ని టిపిక‌ల్ నెరేష‌న్ తో పూర్తి ఆస‌క్తిక‌రంగా సాగ‌ని క్రైమ్ డ్రామాతో సినిమాను ఆక‌ట్టుకునే విధంగా మ‌ల‌చ‌క‌పోయాడు. మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ తో సినిమాను స్టార్ట్ చేసినా, మోహ‌న్ లాల్ గ‌తానికి సంబంధించి మంచి ఎమోష‌నల్ స‌న్నివేశాల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ, సినిమా ఎందుకో కానీ చాలా చోట్ల బోర్ గా సాగదీసిన‌ట్లు అనిపిస్తుంది. సినిమా మొత్తం కాన్‌ఫ్లిట్ ఉన్న‌ట్లే అనిపించినా, ఎక్క‌డా అది స‌రిగ్గా ఎలివేట్ కాలేదు. సినిమాటోగ్ర‌ఫీ బావుంది. సంగీత ద‌ర్శ‌కుడు సుషిన్ శ్యామ్ అందించిన పాట‌లు ఫ‌ర్వాలేద‌నిపిస్తాయి. రీరికార్డింగ్ మాత్రం బాగా ఆక‌ట్టుకునేలా ఉంది. స‌మీర్ ఎడిటింగ్ ఫ‌ర్వాలేదు. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గట్లున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
మోహ‌న్ లాల్
స్టోరీ థీమ్

మైన‌స్ పాయింట్స్ః
కాన్‌ఫ్లిట్ మిస్ అవ‌డం

పంచ్‌లైన్ః పులి జూదంలో పులి మిస్..
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here